Kandachipuram: భార్యపై అనుమానంతో నాలుగు నెలల గర్భిణీ అని చూడకుండా అలా?

Kandachipuram: ఈ మధ్యకాలంలో చాలామంది భార్యాభర్తల మధ్య అనుమానాలు గొడవలు ప్రాణాల వరకు తీసుకొస్తున్నాయి. భార్య భర్తల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలు కారణంగా చాలామంది చంపడం లేదంటే చావడం వరకు వెళుతున్నారు. భార్యపై భర్తలు అనుమానం పెంచుకోవడం, భర్తలపై భార్యలు అనుమానం పెంచుకోవడం వాదనలకు దిగడం కోపంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో చంపడం లాంటివి చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
తమిళనాడు విలుప్పురం జిల్లా కండాచ్చిపురం పరిధిలోని వీరంగిపురం గ్రామంలో భారతి, ఈశ్వరన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది.

 

అయితే పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. దీంతో భార్య భారతితో ఉండలేను అనుకున్న భర్త ఈశ్వరన్ భార్యను వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు భారతి విలుప్పురం జిల్లాకు చెందిన గుణవన్ అనే వ్యక్తితో భారతి పరిచయం పెంచుకుంది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయారు. దాంతో కొద్దిరోజుల తర్వాత భారతి తన ప్రియుడు గుణవన్ ను రెండవ వివాహం చేసుకుంది. అయితే గుణవన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత భారతి రెండవ భర్తతో కాపురం బాగానే చేసింది. ఆ తరువాత భర్త గుణవన్ భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు. నీకు పరాయి మగాళ్లతో సంబంధాలు ఉన్నాయంటూ రోజూ వేధించేవాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు కూడా జరిగేవి.

 

ఎప్పటిలాగే భార్యాభర్తలు ఇటీవల మరోసారి గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త గుణవన్, భారతి 4 నెలల గర్భిణీ అని చూడకుండా ఆమెపై ఇష్టమొచ్చిన విధంగా దాడి చేశాడు. భర్త దాడిలో రక్తపు మడుగులో పడి ఏడుస్తూ నరకం అనుభవించింది భారతి. అది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇక హాస్పిటల్ లో భారతి చికిత్స పొందుతూ మృతి చెందింది. అక్క కూతురు మరణ వార్త తెలుసుకున్న భారతీయ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం భారతీయ భర్త గుణవన్ పై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -