Pawan Kalyan: పవన్ ను క్షమించిమని వేడుకున్న కన్నడ హీరో.. ఏమైందంటే?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఓ కన్నడ హీరో క్షమాపణలు చెబుతానన్నాడు. కన్నడ నాట రాజకీయ నేతగా సుప్రసిద్ధుడైన జమీర్ అహ్మద్ తనయుడు జైద్ ఖాన్.. సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ చిత్రం ద్వారా పాన్ ఇండియా లెవల్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బనారస్ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాల భాషల్లో విడుదలవుతోంది. నవంబర్ 4న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో హీరో జైద్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. బనారస్ చిత్రం విశేషాలు కొన్ని చెబుతుండగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చింది. బనారస్ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఇటీవల తెలుగు వెర్షన్ కు సంబంధించిన కార్యక్రమం విశాఖపట్నంలో జరిగింది. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ ను కలిసే అవకాశం చిత్ర బృందానికి దొరికింది. అయితే, దురదృష్టవ శాత్తూ హీరో జైద్ ఖాన్ ఆ సమయంలో అందుబాటులో లేకుండా పోయాడు.

ఈ విషయంపై జైద్ ఖాన్ స్పందిస్తూ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కలిసే అవకాశం వచ్చినప్పటికీ నేను సద్వినియోగం చేసుకోలేక పోయాను.. ఇందుకు పవన్ కల్యాణ్ కు నిజంగా క్షమాపణలు చెబుతున్నాను. మరోసారి పవన్ ను తప్పకుండా కలుస్తా.. అని చెప్పాడు. వాస్తవానికి తెలుగు ట్రైలర్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగానే విడుదల చేయాలనుకున్నాం.. కానీ కుదరలేదని తెలిపాడు.

వారణాసి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రం..

బనారస్ సిటీ అంటే వారణాసి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సోనాల్ మోంటెరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎన్ కే ప్రొడక్షన్స్ బ్యానర్ పై తిలక్ రాజ్ బల్లాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సతీష్ వర్మ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బనారస్ చిత్రంలో కంటెంట్ ఓ మిస్టీరియస్, డార్క్ ఎలివెంట్ ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. 85 శాతం షూటింగ్ బనారస్ లోనే చత్రీకరించినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts