kantara: ఇండియన్ ఫిల్మ్స్ జాబితాలో ‘కాంతార’ నంబర్1

kantara: ఇటీవల విడుదలైన కాంతార సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ నిలిచింది. భారీ కలెక్షన్లతో సినీ మార్కెట్‌లో దూసుకెళ్తోంది. దీంతో ప్రస్తుతం కన్నడ సినిమాలకు సంబంధించిన ప్రతి విషయం హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులోనూ భారీ వసూళ్లు కొల్లగొడుతోంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. తాజాగా ఐఎండీబీ టాప్ ఇండియన్ ఫిల్మ్స్ జాబితాను విడుదల చేసింది. ఇందులో కాంతార సినిమా నంబర్1 స్థానాన్ని దక్కించుకుంది. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా అయిన బహుబలి 101వ స్థానాన్ని దక్కించుకుంది. ఐఎండీబీ విడుదల చేసిన టాప్ 250 సినిమాల పేర్లను తెలుసుకుందాం.

ఐఎండీబీ జాబితాలో కాంతార మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. రెండో స్థానంలో రామాయణ (ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ) సినిమా చోటు దక్కించుకుంది. 3వ స్థానంలో రాకెట్రీ (ది నంబీ ఎఫెక్ట్), 4వ స్థానంలో నాయకన్, 5వ స్థానంలో అన్బే శివం, 6వ స్థానంలో గోల్‌మాల్, 7వ స్థానంలో జై భీమ్, 8వ స్థానంలో 777 చార్లీ, 9వ స్థానంలో పరియెరుమ్ పెరుమాళ్, 10వ స్థానంలో మణిచిత్రతజు, 11వ స్థానంలో 3 ఇడియట్స్, 12వ స్థానంలో అపూర్ సంస్కార్, 13వ స్థానంలో బ్లాక్ ఫ్రైడే, 14వ స్థానంలో కుంబలంగీ నైట్స్, 15వ స్థానంలో #హోమ్ సినిమాలు చోటు దక్కించుకున్నాయి.

ఐఎండీబీ తెలుగు సినిమాల వివరాల్లో.. 17వ స్థానంలో కేరాఫ్ కంచరపాలెం, 22వ స్థానంలో జెర్సీ, 39వ స్థానంలో సీతారామం, 44వ స్థానంలో మహానటి, 48వ స్థానంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, 101వ స్థానంలో బహుబలి (ది కన్‌క్లూజన్), 125వ స్థానంలో బొమ్మరిల్లు, 129వ స్థానంలో రంగస్థలం, 134వ స్థానంలో అతడు, 146వ స్థానంలో పెళ్లిచూపులు, 155వ స్థానంలో ఎవరు, 156వ స్థానంలో క్షణం, 165వ స్థానంలో మేజర్, 176వ స్థానంలో వేదం, 179వ స్థానంలో అర్జున్ రెడ్డి, 182వ స్థానంలో బహుబలి (ది బిగినింగ్), 190వ స్థానంలో ఆర్ఆర్ఆర్, 209వ స్థానంలో ఒక్కడు, 212వ స్థానంలో పోకిరి, 217వ స్థానంలో మనం, 220వ స్థానంలో ఊపిరి, 236వ స్థానంలో హ్యాపీడేస్, 244వ స్థానంలో గూఢచారి వంటి సినిమాలు 250 జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -