Kantara Collections: గాడ్ ఫాదర్ కంటే కాంతార కలెక్షన్లు ఎక్కువా?

Kantara Collections: కన్నడనాట సూపర్ హిట్ టాక్ తో తెలుగులోకి డబ్ అయిన సినిమా “కాంతారా”. కన్నడ ప్రేక్షకులను, తెలుగు సినీ జనాలను ఆకట్టుకోవడంతో పాటు.. భారతదేశంలోని సినీ ప్రియులందరినీ అలరించింది. సాధారణంగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి అలరించిన ఈ సినిమా.. టాలీవుడ్ లో తాజాగా నైజాం కలెక్షన్ల విషయంలో మరో మైలురాయి అందుకుంది.

 

మెగాస్టార్ చిరంజీవి పవర్ బ్యాక్ మూవీస్ లోనే అత్యంత హిట్ సినిమాగా స్థానం పొందిన సినిమా “గాడ్ ఫాదర్”. ఇక చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ కి మంచి బూస్ట్ అందించినట్టుగా ఈ సినిమాను అందరు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం కలెక్షన్ల విషయంలో ఈ సినిమాను ఓ చిన్న డబ్ మూవీ అయిన “కాంతారా” దాటేస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన “కాంతారా” మూవీ మెగా మూవీని వెనక్కి నెట్టడం చర్చనీయాంశంగా మారింది.

 

గాడ్ ఫాదర్ సినిమా నైజాంలో అత్యంత కష్టంగా 12 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఇక కాంతారా మూవీ ఇప్పటికే నైజాం లో 11 కోట్ల వరకు రాబట్టింది. ఇంకా సులభంగా మరో నాలుగైదు కోట్లు రాబడుతుందని.. తెలుగు సినీ వ్యాపార వర్గాలు తెలియజేస్తున్నాయి. అసలు గాడ్ ఫాదర్ మూవీ కలెక్షన్లు భీమ్లానాయక్, సర్కారు వారి పాట సినిమాల కలెక్షన్లలో 3వ వంతు కూడా రాలేదు. ఇక ఇప్పుడు ఓ డబ్బింగ్ మూవీ గాడ్ ఫాదర్ ని దాటనుంది.

 

మొత్తంగా చూసుకుంటే.. విశాఖ మొత్తం మీద 6 కోట్లే రాబట్టింది గాడ్ ఫాదర్. అంటే 25 కోట్లు రేషియో అన్నమాట. ఇక ఈ ఎఫెక్ట్ ప్రస్తుతం చిరంజీవి “వాల్తేర్ వీరయ్య” సినిమాపై పడుతుందని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు. టఫ్ కాంపిటీషన్ ఉన్న ఈ సమయంలో “వాల్తేరు వీరయ్య” ను ఏ రేషియోలో అమ్ముతారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -