Pawan Kalyana Target : పవన్ లక్ష్యంగా కాపు నేతలను రంగంలోకి దింపిన జగన్.. ఇక మూకుమ్మడి ఎటాక్

Pawan Kalyana Target : జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్‌గా సీఎం వైఎస్ జగన్ పక్కా స్కెచ్ వేశారు. పవన్ లక్ష్యంగా వైసీపీ నేతలను రంగంలోకి దింపనున్నారు. ఆదివారం పవన్ కల్యాణ్ మంగళగిరిలోని జనసేన కార్యాయలంకు వెళ్లనున్నారు. జనసేన ప్రధాన కార్యాలయంలో జరగనున్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో పవన్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో కలిసేందుకు పవన్ సిద్దమైన క్రమంలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కీలకంగా మారింది.

ఈ క్రమంలో పవన్ పై కాపు వైసీపీ నేతలను జగన్ ప్రయోగించారు. రాజమండ్రిలో కాపీ వైసీపీ నేతలందరూ సమావేశం కానున్నారు. కాపు మంత్రులు, వైసీపీ కాపు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. పవన్ కల్యాణ్ సమావేశం జరుగుతున్న క్రమంలో కాపు నేతల సమావేశం ఏర్పాటు చేయడం కీలకంగా మారింది. పవన్ పై ఎదురుదాడి చేసేందుకే కాపు నేతలందరూ సమావేశం కావాల్సిందిగా జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పవన్ పై వైసీపీ కాపు నేతలతోనే జగన్ విమర్శలు కరిపిస్తున్నారు. కానీ ఒక్కొక్కరూ చేయడం ద్వారా అంతంగా మైలేజ్ రావడం, అందరూ మూకుమ్మడిగా దాడి చేసేలా జగన్ ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు.

జగన్ సర్కార్ పై పోరును పవన్ షురూ చేశారు. విశాఖపట్నంలో జనసేన కార్యకర్తల అరెస్ట్, జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు అడ్డుకోవడంపై పవన్ ఫైర్ మీద ఉన్నారు. టీడీపీతో పాటు బీజేపీ, వామపక్షాలు కూడా పవన్ కు మద్దతు పలికాయి. దీంతో జగన్ ప్రభుత్వంపై పవన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీతో పాటు మిగతా అన్ని పార్టీలను కూడా కలుపుకుని ఉద్యమం చేయాలని పవన్ ప్రయత్నిస్తున్నారు. విశాఖలో తనకు జరిగిన అవమానంపై పవన్ రలిగిపోతున్నారు. దీంతో వైసీపీ సర్కార్ పై పోరును ఉధృతం చేయాలని చూస్తున్నారు.

ఇలాంటి తరుణంలో పవన్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు జగన్ రంగంలోకి దిగారు. వైసీపీ కాపు నేతలతో పవన్ దూకుడుకు చెక్ పెట్టించే ప్లాన్ ను ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా కాపు నేతలందరితో మూకుమ్మడిగా పవన్ పై మాటల దాడి చేయించడంతో పాటు కాపు ఓటర్లు పవన్ వైపే మళ్లకుండా స్కెచ్ లు వేస్తోన్నారు. కాపు సామాజికవర్గం మొత్తం వైసీపీ వైపే ఉందని తెలిపేలా కాపు వైసీపీ నేతలతో ప్రచాారం చేయించనున్నారు. ఇటీవల కాపు వైసీపీ నేతలకు పవన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

కాపు సామాజికవర్గానికి అన్యాయం చేయాలని చూస్తూ ఊరుకుబోమని హెచ్చరించారు. కాపు సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకోవడంలో భాగంగానే పవన్ అలాంటి వ్యాఖ్యలు చేశారని చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలతో కాపు సామాజికవర్గంలో పవన్ కు మైలేజ్ పెరిగిందని, దానిని దెబ్బతీసేందుకు వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టిందని రాజకీయ వర్గాలు భావిస్తోన్నాయి. కాపు సామాజికవర్గం పవన్ వైపు వెళ్లుకుండా వారిని శాంతిపపరిచే ప్రయత్నాల్లో జగన్ ఉన్నట్లు చెబుతుననారు. అందులో భాగంగానే కాపు నేతల మీటింగ్ అని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts