Karishma Kapoor: కేవలం ఒక డ్రస్సు పట్టలేదు అన్న కారణంతో నా భర్త అత్త నన్ను హింసించారు.

Karishma Kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఓ వెలుగు వెలిగిన తార కరిష్మా కపూర్. ఆమె కెరియర్ లో ఎందరో పెద్ద స్టార్స్ జతన నటించిన మెప్పించింది. తన అందాలతో కుర్రకాలను ఒక ఊపు ఊపింది కరిష్మా. తన కెరియర్ అద్భుతంగా సాగుతున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా తన చిన్ననాటి స్నేహితుడు సంజయ్ కపూర్ ను ఆమె వివాహం చేసుకుంది.

ఆ సమయంలో కొద్దికాలం పాటు అభిషేక్ బచ్చన్ కరిష్మా కపూర్ కి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టు పుకార్లు వచ్చాయి. అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ పెళ్లిలో కరిష్మాకు అభిషేకు ఏర్పడిన పరిచయం తరువాత ప్రేమగా మారింది. ఐదు సంవత్సరాల వీరిద్దరి స్నేహం పెద్దల ఆమోదాన్ని పొంది పెళ్లి వరకు వచ్చి అనూహ్యంగా ఎంగేజ్మెంట్ దగ్గరే ఆగిపోయింది. ఆ తర్వాత కరిష్మా సంజయ్ ని పెళ్లి చేసుకుంది.

పెళ్లయినప్పటి నుంచి కరిష్మా సంజయ్ ఇద్దరు ప్రశాంతమైన వైవాహిక జీవితాన్ని గడిపిన సందర్భం లేదు. ఎప్పుడూ ఇద్దరి మధ్య ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంది. సంజయ్ పై గృహహింస కు పాల్పడినట్లు ఆరోపిస్తూ కరిష్మా పోలీసు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. ఒక డ్రెస్సు తనకు పట్టకపోవడంతో సంజయ్ ఆమెను చంప దెబ్బ కొట్టమని అతని తల్లికి చెప్పినట్లు కరిష్మా ఆ కంప్లైంట్ లో పేర్కొంది.

అసలు వివరాల్లోకి వెళితే పెళ్లయిన కొత్తల్లో కరిష్మా కి సంజయ్ తల్లి ఒక డ్రెస్ ను గిఫ్ట్ గా ఇచ్చిందట. కియన్ పుట్టిన తర్వాత కరిష్మా కొద్దిగా లావు అయిందట. ఆ సమయంలో ఆ డ్రెస్ వేసుకోవాల్సిందిగా సంజయ్ తల్లి కోరిందట. ఆ డ్రెస్ తనకు పెట్టకపోవడంతో కోపం తెచ్చుకున్న సంజయ్ ఆమెను కొట్టమని తల్లిని పురమాయించాడట. తన అత్త తనకు సపోర్ట్ చేయకుండా కొడుకుని వెనకేసుకు రావడం పై కరిష్మా ఆవేదన వ్యక్తం చేసింది.

2016లో ఈ ఇద్దరికీ చట్టబద్ధంగా విడాకులు మంజూరు అయ్యాయి. ఈ నేపథ్యంలో పిల్లలిద్దరి బాధ్యత తల్లి అయిన కరిష్మాకు అప్పగించడం జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -