Jr NTR: ఎన్టీఆర్ కు ఆహ్వానం అందడంతో ఆ స్టార్ హీరో ఫీలయ్యారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీకి వెళ్లనున్నారు. తాజాగా కర్ణాటకలో బొమ్మై సర్కార్.. దివంగత పునీత్ రాజ్ కుమార్ కు ‘కర్ణాటక రత్న’ విశిష్ట పురస్కారాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం నవంబర్ 1న కర్ణాటక అసెంబ్లీలో జరుగుతోంది. ఇందుకు సౌత్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఇప్పటికే ఆహ్వానం వెళ్లింది. టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించింది బొమ్మై ప్రభుత్వం.

అయితే, సినీ ఇండస్ట్రీ నుంచి ఓ స్టార్ హీరోను ఆహ్వానించకపోవడంపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై.. జూనియర్ ఎన్టీఆర్ వైపే మొగ్గుచూపడంపై ఓ హీరో ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. కన్నడ చిత్ర సీమలో పునీత్ రాజ్ కుమార్ ముద్ర ఎనలేనిది. ఆయన మరణంతో కన్నడనాట శోకసంద్రంగా మారింది. పునీత్ కు నివాళులర్పించడానికి టాలీవుడ్ నుంచి అనేక మంది తరలి వెళ్లారు.

ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లి వచ్చారు. కన్నడ నాట జూనియర్ ఎన్టీఆర్ కు జనాదరణ ఆదరణ బాగుంది. నవంబర్ 1న జరిగే కార్యక్రమానికి ఆహ్వానం అందడంతో అందుకు జూనియర్ సమ్మతించాడని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. పునీత్ రాజ్ కుమార్ కు ఉన్న గౌరవాన్ని రెట్టింపు చేసేలా ఈ అవార్డును అందిస్తున్నట్లు బొమ్మై ప్రభుత్వం తెలిపింది. కర్ణాటకలో అత్యున్నతమైన కర్ణాటక రత్న పురస్కారాన్ని ఆయనకు ప్రకటించారు.

సీనియర్లను కాదని జూనియర్ నే ఎందుకంటే..

బీజేపీ ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ ను పిలవడంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇదివరకే హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రం విజయవంతం కావడంతో అభినందించడానికే ఈ భేటీ అని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సైతం టాలీవుడ్ లో సీనియర్ నటులను, ముఖ్యంగా టాలీవుడ్ పెద్దగా భావించే ఓ హీరోను పక్కనబెట్టి జూనియర్ ఎన్టీఆర్ నే పిలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -