Karthika Vratam: వ్రతంతో కార్తీక పురాణం లో ఉన్న విషయాలేంటో తెలుసా?

Karthika Vratam: శివకేశవులకు అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే శివ, కేశవులను పూజిస్తారు వారికి కైవల్యం ప్రాప్తిస్తుందని పురాణాల్లో వెల్లడైంది. కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడంతో విశేషమైన ఫలితాలు కలుగుతాయని కార్తీక పురాణంలో చెప్పబడింది. కార్తీక పురాణం ఆధారంగా కార్తీక మాసంలో వ్రతాన్ని ఆచరించాల్సిన వారు ఏం చెయ్యాలి.. దాని వల్ల కలిగే ఫలితం ఏంటి? అనేది కార్తీక పురాణంలో వివరించబడింది. కార్తీకమాసం అత్యంత మహిమాన్వితమైనది. కార్తీక మాస వ్రత ఆచరణ అన్ని ధర్మాల కన్నా శ్రేష్టమైనది అని చెబుతూ ఉంటారు. అందుకు విశేషమైన కారణం ఉందని కార్తీక పురాణంలో జనకమహారాజు అడిగిన ప్రశ్నకు వశిష్ఠుడు ఈ విధంగా చెప్పారని చెప్పబడింది.

కార్తీకమాస వ్రతాన్ని సూర్యుడు తులా సంక్రమణాదిగా ఉన్నప్పుడు కానీ.. శుద్ధ పాడ్యమి నుంచి కానీ ప్రారంభించాలని సూచించారు. కార్తీక వ్రత సంభవం సర్వపాప హరణం సర్వపాపహరం పుణ్యవ్రతం కార్తీక సంభవం.. నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే.. అని చెబుతారు. కార్తీకమాస వ్రతాన్ని చేస్తే సర్వ పాపాలు నశించి, పుణ్యం కలుగుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ కార్తీకమాసంలో శివకేశవులకు విశేషంగా పూజలు చేస్తారని కార్తీక పురాణంలో చెప్పబడింది.

కార్తీక మాస వ్రతం ఆచరించేవారు సూర్యోదయ వేళ నదీస్నానం చేసి పవిత్రమైన ఆత్మతో పూజాది కార్యక్రమాలు చేపట్టాలి. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన సమయంలో పవిత్ర గంగానది సమస్త నదీజలాలలో చేరుతుంది. అంతేకాదు సమస్త జలాశయాలలో విష్ణువు వ్యాపించి ఉంటాడు. అందుకే నదీ జలాలలో స్నానం చేసి మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్ధి తో భగవంతుడిని ధ్యానం చేసుకుని కార్తీకమాస వ్రతానికి శ్రీకారం చుట్టాలి.

ఎట్టి పరిస్థితిలోనూ అన్యమనస్కంగా ఉండరాదు. ఆపై మధ్యాహ్నం శాఖాహార భోజనం చేసి తిరిగి సాయంత్రం వేళ దేవాలయానికి వెళ్లి యదాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామివారిని ఆరాధించాలి. స్వామి వారికి నైవేద్యం పెట్టి మనసారా ఆయనను స్తుతించి నమస్కరించుకోవాలి. కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితమిదే కార్తీకమాసం పొడవునా ఈ వ్రతాన్ని ఈ విధంగా ఆచరిస్తే వైకుంఠ ప్రాప్తి పొందుతారని జనకుడికి వశిష్ఠుడు తెలిపారు. కులాలు, వర్గాలకు అతీతంగా ఎవరు ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తారు వారికి మోక్షం కలుగుతుందని తెలిపారు. తమకు తాముగా వ్రతాన్ని ఆచరించలేని వారు, ఇతరులు వ్రతాన్ని చేస్తుండగా చూసే..అతను చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -