Karthikeya 2: నిలబడ్డ నిఖిల్.. ప్రతీసారి అంతే.. అప్పుడలా.. ఇప్పుడిలా

Karthikeya 2 గ‌త కొంతకాలంగా టాలీవుడ్ లో ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.. సినిమా నిర్మాణ వ్య‌యం పెరిగ‌డం, థియేట‌ర్ల‌కు జ‌నం రాక‌పోవ‌డంతో తాము ఎంత‌గానో న‌ష్ట‌పోతున్నామ‌ని నిర్మాత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం మానేసి ఓటీటీలో చూసేద్దామ‌ని వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితిల్లో మొన్న విడుద‌లైన బింబిసార‌, సీతారామం చిత్రాలు ఈ విష‌యం త‌ప్ప‌ని నిరూపించాయి. కంటెంట్ బాగుంటే థియేట‌ర్ల‌కు జ‌నం వ‌స్తార‌ని ఈ సినిమాల క‌లెక్ష‌న్లు నిరూపించాయి..

ఇదే కోవ‌కి చెందిన‌దే ఈ రోజు విడుద‌లైన కార్తికేయ‌2.  చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో నిఖిల్, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన ఈ చిత్రం ఈ రోజు రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియాగా రూపొందిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.  అయితే ఈ విజ‌యం సొంతం చేసుకోడానికి చిత్ర బృందం చాలా క‌ష్టాలు ప‌డాల్సివ‌చ్చింది..

Karthikeya 2
Karthikeya 2 proves that content is more important for a movie

ఎప్పుడో షూటింగ్ ప‌నులు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుద‌ల‌కు నోచుకోవ‌డానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. రిలీజ్ చేయ‌డానికి థియేట‌ర్లు ఇవ్వ‌డం లేదంటూ హీరో నిఖిల్ ఒకింత అస‌హ‌నాన్ని కూడా వెళ్ళ‌బుచ్చాడు. చివ‌రికి ఎన్నో ఆటంకాల మ‌ధ్య ఈ రోజు విడుద‌లైన ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకోవ‌డం కార్తికేయ2 టీమ్ తో పాటు టాలీవుడ్ లో కూడా సంతోషాన్ని నింపింది.

అయితే హీరో నిఖిల్ కు మాత్రం ఇలాంటి ఆటంకాలు కొత్త‌వేం కాదు.  2016లో డీమోనిటైజేష‌న్ స‌మ‌యంలో ఎవ‌రి ద‌గ్గ‌రా అంత‌లా డ‌బ్బులు లేవు. అలాంటి స‌మ‌యంలో త‌న ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. అప్పుడు క‌లెక్ష‌న్లు రావ‌ని అంద‌రూ భావించారు. కానీ అలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో సినిమాని రిలీజ్ చేసి వ‌సూళ్ళు రాబ‌ట్టాడు. అలాగే అర్జున్ సుర‌వ‌రం సినిమా స‌మ‌యంలో కూడా అనేక ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ నిఖిల్ త‌న సినిమాని రిలీజ్ చేసి సూప‌ర్ హిట్ కొట్టాడు.

Related Articles

ట్రేండింగ్

Minister Roja: నాడు అప్పులు నేడు కోట్ల రూపాయల ఆస్తులు.. ఆ పనులు చేసి రోజా కోట్లు సంపాదించారా?

Minister Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి నగరి ఎమ్మెల్యే రోజా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తైన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈసారి కూడా తనను గెలిపించే...
- Advertisement -
- Advertisement -