Katrina Kaif: బాలయ్య హీరోయిన్ బ్యాన్ వెనుక ఇంత కథ ఉందా?

Katrina Kaif: బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆమెకు ఇటు సౌత్ లో కూడా ఫాన్స్ అసోసియేషన్ తక్కువ ఏమీ కాదు. మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకు కత్రినా సుపరిచితమే. ఎన్నో బ్లాక్బస్టర్ మూవీస్ లో నటించిన కత్రినా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. కత్రినా డాన్స్ కు, ఆమె అందానికి కుర్ర కారు ఫిదా అయిపోయారు. కత్రినా యువత మనసును ఓ రేంజ్ లో ఉర్రూతలూగించిందని చెప్పొచ్చు.

ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ కి పెళ్లి అయినా సరే ఇంకా సినిమా ఛాన్సులు ఏ మాత్రం తగ్గకుండా వస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ లో మల్లీశ్వరి మూవీ లాంటి బ్లాక్బస్టర్ చిత్రంలో నటించినప్పటికీ కత్రినాకు తెలుగులో తిరిగి ఎటువంటి మంచి ఆఫర్స్ రాలేదు. మరి మన టాలీవుడ్ హీరోలు ఎందుకు కత్రినా ని సెలెక్ట్ చేసుకోలేదు అని ఆలోచిస్తున్నారా? దాని వెనక ఓ పెద్ద కారణం ఉంది.

కత్రినా చాలా హైట్ అన్న విషయం అందరికీ తెలిసింది. అంత హైట్ ఉన్న హీరోయిన్ ని హైట్ తక్కువ ఉన్న హీరోల సరసన అడ్జస్ట్ చేయడం కొద్దిగా కష్టమైన పని. ఎందుకు వచ్చిన అనవసరమైన ఇబ్బందులు అని మాక్సిమం పొడుగు ఉండే హీరోయిన్ల జోలికి పోయే వాళ్లే కాదు. అప్పట్లో బాలయ్య పక్కన కత్రినాను తీసుకోవాలి అన్న ఆలోచన వచ్చిన ఈ విషయం మీదే కత్రినా చాన్స్ మిస్ చేసుకుంది

అంతేకాకుండా ఈ బాలీవుడ్ భామ రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంటుంది. మల్లీశ్వరి మూవీ కే అప్పట్లో దాదాపు కోటిన్నర వరకు కత్రినా పుచ్చుకుందని సమాచారం. మరీ అంత రెమ్యూనరేషన్ ముట్ట చెప్పి ఈ పొడుగు కాళ్ళ సుందరిని తీసుకోవడం అవసరమా అన్న ఉద్దేశంతో టాలీవుడ్ ఓ రకంగా తనని బ్యాన్ చేసింది. లేకపోతే ఈ బ్రిటిష్ బ్యూటీ టాలీవుడ్ తారల తో ఎన్నో సినిమాలు చేసిది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -