Katrina Kaif: కత్రినా కైఫ్ భర్తకు పెట్టిన షాకింగ్ షరతులు ఇవే!

Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సినిమా ‘మల్లీశ్వరీ’ గుర్తుకు ఉండే ఉంటుంది. ఈ సినిమాలో యువరాణి పాత్రలో కత్రినీ కైఫ్ ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాను ఇప్పటికీ చూసినా నవ్వు ఆపుకోలేరు. ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. అప్పట్లో కత్రినా టాలీవుడ్‌లో ప్రొడ్యూసర్లను టార్చర్ పెట్టిందనే వార్త సినీ వర్గాల్లో వైరల్ అయ్యాయి. దాంతో టాలీవుడ్‌ నుంచి ఆఫర్లు రావడం తగ్గాయి. బాలీవుడ్‌లో మాత్రం కత్రినాకు భారీగా ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇటీవలే కత్రినా ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అయితే కత్రినా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటుందట. పెళ్లికి ముందే.. తమ సంపాదన తమదని కండీషన్ పెట్టిందట. ఈ న్యూస్ బాలీవుడ్‌లో తెగ వైరల్ అయింది. తాజాగా కత్రినా కైఫ్ వైవాహిక జీవితం గురించి ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది.

 

 

సినిమాల్లో ఎలా నటించినా.. కత్రినా మొదటి నుంచి ఎంతో ట్రెడిషనల్‌గా ఉంటుంది. ఎలాంటి విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పేస్తుంది. భర్త విక్కీ కౌశల్‌కు కూడా కొన్ని కండీషన్లు పెట్టిందట. కత్రినా హీరోయిన్‌గా.. విక్కీ హీరోగా ఎన్ని సినిమాలు చేసినా.. పనికి సంబంధించిన ఎలాంటి టెన్షన్ అయినా బయటే వదిలేయాలని చెప్పిందట. వన్స్ బెడ్‌రూమ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత భార్య భర్తలుగా ఉండాలని తెలిపిందట. అలాగే బెడ్‌రూమ్‌లో పక్క వాళ్ల విషయాల గురించి చర్చించకూడదని కండీషన్ పెట్టిందట. కేవలం తమ పర్సనల్ విషయాలు మాత్రమే మాట్లాడాలని చెప్పిందట. అయితే ఈ కండీషన్లు విన్న పలువురు.. కత్రినాను చూసి మెచ్చుకుంటున్నారట. ఈ రూల్స్ ప్రతీ భార్యాభర్తలు ఫాలొ అయితే ఎలాంటి గొడవలు జరగవని నెటిజన్లు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు మార్చిన చంద్రబాబు.. కొత్త పేరు ఏంటో తెలుసా?

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాగళం పేరిట ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -