TRS: టీఆర్ఎస్ పేరు మార్పుపై సీఎం కేసీఆర్ నోటిఫికేషన్

TRS: టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ పేరుగా మార్చడంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడంపై బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు పత్రికల్లో పబ్లిక్ నోటీస్ జారీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం కేసీఆర్ పేరుతో ఈ పబ్లిక్ నోటీస్ జారీ అయింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుతూ తీసుకున్న నిర్ణయంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా ఈసీకి తెలపాలని పబ్లిక్ నోటీస్ లో పేర్కొన్నారు. వివిధ పత్రికలో దీనికి సంబంధించిన ప్రకటన ఇచ్చారు.

 

ఎవరికైనా సరే ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఢిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయం అడ్రస్‌కి కారణాలతో సహా అభ్యంతరాలు పంపాలని పబ్లిక్ నోటీస్ లో పేర్కొన్నారు. అభ్యంతరాలు పంపించేందుకు 30 రోజుల గడువు ఇచ్చారు. దీంతో 30 రోజుల తర్వాత బీఆర్ఎస్ గా పేరు మార్చుకోవడంపై ఈసీ నుంచి అనుమతి వచ్చే అవకాశముంది. ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి వచ్చే అభ్యంతరాలపై ఈసీ పరిశీలన చేపట్టనుంది. అనంతరం టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుకోవడంపై ఈసీ అధికారికంగా అనుమతి ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది.

 

ఈ ఏడాది దసరా రోజున టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ నేతలందరీ సమక్షంలో తెలంగాణ భవన్ లో కేసీఆర్ తీర్మానం చేశారు. మరుసటి రోజే టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం ఢిల్లీ వెళ్లి ఈసీకి తీర్మానం కాపీని అందించి పేరు మార్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. దాదాపు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు టీఆర్ఎస్ పేరు మార్చడానికి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ తీర్మానం కాపీని ఈసీ పరిశీలించింది. కానీ ఇప్పటినుంచి ఈసీ నుంచి బీఆర్‌ఎస్‌కు సంబంధించి ఎలాంటి అనుమతి రాలేదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: భర్త పదవి భార్యకు ఇస్తున్న ఏపీ సీఎం జగన్.. ఈ ప్రయత్నాలు ఫలించే ఛాన్స్ ఉందా?

CM Jagan: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసి సీఎం జగన్ లో కనిపిస్తుంది. టెక్కలి నుంచి టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెంనాయుడు పోటీలో ఉన్న...
- Advertisement -
- Advertisement -