CM KCR National Party Launch: జాతీయ పార్టీని అధికారికంగా ప్రకటించిన కేసీఆర్.. పార్టీ పేరు ఇదే!

CM KCR National Party Launch:  తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీని నెలకొల్పిన కేసీఆర్.. జాతీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఎనిమది రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య అట్టహాసంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇక ‘భారత్ రాష్ట్ర సమితి’ గా పేరు మారుస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును మార్చేందుకు తీర్మానాన్ని పార్టీ సర్వ సభ్య సమావేశంలో ప్రవేశపెట్టగా.. ఏకగ్రీవంగా తీర్మానానికి ఆమోదం లభించింది. తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ బాడీ మీటింగ్ లో పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా సవరణ చేయాలని తీర్మానించగా.. అందుకు అవసరమైన రాజ్యాంగ బద్ధ ప్రక్రియను కూడా పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారు.

అందులో భాగంగా టీఆర్ఎస్ లీగల్ సెల్ కు చెందిన సభ్యులు ఢిల్లీకి బయలుదేరనున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేత వినోద్ కుమార్, శ్రీనివార్ రెడ్డిలతో కూడిన బృందం రేపు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ను కలవనున్నట్లు సమాచారం అందుతోంది. కాగా ఎన్నికల కమిషన్ నిర్ణీత గడువుతో ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాల్సిందిగా కోరుతుందని, ఆ తర్వాత పార్టీ పేరును మారుస్తుందని తెలుస్తోంది.

కాగా దేశంలో కావాల్సినన్ని వనరులు ఉన్నా కానీ వాటిని ఉపయోగించుకునే మేధోసంపత్తి నేతలకు లేకపోవడం వల్ల దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న స్టేజ్ లోనే ఉందని గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. దేశంలో రాజకీయ మార్పు రావాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్, బీజేపీలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కు ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచన లేదా.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ హవానే...
- Advertisement -