KCR Master Plan: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీజేపీ టీడీపీలకు చాకిరేవే అంటూ?

KCR Master Plan: తెలంగాణలో కేసీఆర్ ను ఓడించి అధికారంలోకి రావడం ఇతర పార్టీలకు అసాధ్యం అన్న భావన భారతీయ జనతా పార్టీలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా వారికి సమానమైన బలం లేకపోవడమే అందుకు కారణం. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి రాష్ట్ర నాయకులు ఎంత హడావుడి చేసినా కూడా బలహీనతల పై వారికి స్పష్టత ఉన్నాది. దాంతో ఇతర పార్టీల నుంచి నాయకులను ఫిరాయింపజేసుకోవడం కోసం ప్రత్యేకంగా రాష్ట్ర కార్యవర్గంలో ఒక చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. రిజల్టు పెద్దగా లేదు.

ప్రస్తుతం ఖాళీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా ఈ చేరికల కమిటీ ఎరకు లొంగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పొత్తు ద్వారా కొంత అదనపు క్షేత్రస్థాయి బలం చేకూరుతుందని బీజేపీ అధిష్ఠానం ఆశపడడం తప్పు కాదు. అయితే పొత్తు గురించిన వార్తలన్నీ ఊహాగానాలే అని బండిసంజయ్ లాంటి వారు కొట్టిపారేస్తున్నారు. బండి విముఖత సంగతి ఎలా ఉన్నప్పటికీ గులాబీదళంలో మాత్రం ఈ పొత్తు గురించి ఆనందం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు నాయుడు అంటేనే ఒంటి కాలిపై లేచే కేసీఆర్ కు, తెలుగుదేశం తో భాజపాతో పొత్తు పెట్టుకోవడం అనేది బ్రహ్మాస్త్రం లాగా అందివస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. 2018 ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.

 

రాహుల్ తో కలిసి రోడ్ షోలు, బహిరంగ సభలలో పాల్గొన్నారు. ఏ కాంగ్రెస్ వ్యతిరేకత అనే ఎజెండా తమ మూలాల్లో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో ఆ కాంగ్రెస్ తోనే ఆయన అంటకాగారు. అయితే ఆ సమయంలో ఎన్నికల ప్రచార సభలో ఈ మైత్రీ బంధాన్ని కేసీఆర్ ఒక రేంజిలో ఆడుకున్నారు. ఆయన ఫోకస్ పూర్తిగా చంద్రబాబు మీదనే సాగిపోయింది. అది వారికి వర్కవుట్ అయింది కూడా. తెలుగుదేశానికి పుట్టగతులు లేకుండా పోగా, వారితో కొత్త బంధం ముడివేసుకున్నందుకు కాంగ్రెస్ కూడా నామరూపాలు లేకుండాపోయింది. కేవలం తెలుగుదేశం పొత్తువల్ల మాత్రమే తమ పార్టీ నష్టపోయిందని ఓటమి తర్వాత పోస్టుమార్టం నివేదికల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు. కాబట్టి చంద్రబాబు పొత్తు వల్ల కెసిఆర్ కు లాభమే తప్ప నష్టం లేదు.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -