CM KCR: కొత్త పార్టీ ప్రచారానికి కేసీఆర్ పక్కా ప్లాన్.. జాతీయ మీడియాలో పెయిడ్ క్యాంపెయిన్..!

CM KCR: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. దసరా రోజు కొత్త పార్టీపై ఆయన ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్.. నమస్తే తెలంగాణ దినపత్రిక, టీ న్యూస్ చానల్స్ సహాయపడిన సంగతి తెలిసిందే. ఈ రెండు చానల్స్‌ కూడా కేసీఆర్ కుటుంబం ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్న కేసీఆర్.. కొత్త రాజకీయ పార్టీపై నేషనల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం కోసం తనదైన వ్యుహాలు రచిస్తున్నారు. తనకున్న రాజకీయ అనుభవం దృష్ట్యా.. ఈ ఇది చాలా అవసరమని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న కమర్షియల్ ట్రెండ్ ప్రకారం.. ఏ మీడియా సంస్థ కూడా లాభం లేనిదే ప్రచారానికి అంగీకరించే అవకాశం లేదు. ఈ క్రమంలోనే కేసీఆర్ టీమ్.. ఇందుకోసం మీడియా సంస్థలకు కొంత మొత్తంలో చెల్లింపులు చేసి.. పెయిడ్ ప్రచారం చేయించాలని భావిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కొత్త పార్టీకి వార్తలకు నేషనల్ మీడియాలో కవరేజ్ దక్కే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఈ ప్రచారానికి సంబంధించిన మెటిరీయల్, ప్రత్యేకమైన యాడ్స్‌ను కూడా సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. కొత్త పార్టీపై ప్రకటన చేసిన తర్వాత.. పెద్ద ఎత్తున జాతీయ మీడియాలో ప్రకటనలు వచ్చేలా ప్లాన్ చేశారు.

మరోవైపు కేసీఆర్ జాతీయ చానల్ ప్రారంభించడం లేదా ప్రస్తుతం ఉన్న ఏదైనా ఒక చానల్‌ను తమకు అనుకూలంగా ప్రచారం చేసేలా ఒప్పందం చేసుకోవాలనే ఆలోచన కూడా సీఎం కేసీఆర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ దిశగా కేసీఆర్ ఇప్పటికే కొందరితో చర్చలు కూడా జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి కేసీఆర్ ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని సమాచారం.

ఇదిలా ఉంటే.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ప్రచారానికి సోషల్ మీడియా వేదికగా కూడా భారీ ప్రణాళికలే రచించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్‌కు భారీ సోషల్ మీడియా వింగ్ ఉన్న సంగతి తెలిసిందే. విపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టడమే కాకుండా.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పోస్టులు చేస్తుంటారు. అయితే ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ విజయాలను ప్రధానంగా వివరించడమే కాకుండా, జాతీయ మీడియాలో వచ్చే వార్తలను కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

అదే సమయంలో కేంద్రంలోని అధికార బీజేపీ చెబుతున్న.. డబుల్ ఇంజన్ సర్కార్‌ ప్రచారాన్ని కూడా తిప్పికొట్టేలా కంటెంట్ సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పరిస్థితులను.. తెలంగాణలోని పరిస్థితులతో పోల్చి కౌంటర్ ఇవ్వనున్నారు. ఇలా చేయడం ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ గురించి చర్చ జరగాలన్నది వారి ప్లాన్.

ఈ విధంగా చేయడం ద్వారా కేసీఆర్.. తాను బీజేపీకి ప్రత్యామ్నాయం అనే భావన కలిగించాలని చూస్తున్నారు. జాతీయ స్థాయిలో తన మార్క్ కనిపించేలా చేయడం ద్వారా అందరి అటెన్షన్‌ను తనవైపుకు తిప్పుకోనున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -