KCR: మీరు జాతిరత్నాలు.. ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ప్రశంస

KCR: తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో ఉన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రశంసించారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డిలను కేసీఆర్ ప్రశంసించారు. మీరు జాతిరత్నాల అని కేసీఆర్ పొగిడారు. ప్రగతిభవన్ నుంచి ఆ నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ కు చేరుకుని టీఆర్ఎస్ విస్తృతస్ధాయి సమావేశంలో పాల్గొన్నారు.

 

సమావేశం ముగిసిన తర్వాత ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగి ప్రగతిభవన్ కు చేరుకున్నారు. ఇంకా కొన్ని రోజుల పాటు వాళ్లు ప్రగతిభవన్ లోనే ఉండనున్నారు. చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తుండటంతో.. భద్రత కారణంగా వారిని ప్రగతిభవన్ లోనే ఉండాలని కేసీఆర్ సూచించారు. తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు రక్షణ కోసమే ప్రగతిభవన్ లో ఉంచారని ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, బాలరాజు తెలిపారు.

 

ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో ఉన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రత పెంచింది. వారికి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కేటాయించింది. 4+4 భద్రత పెంచుతూ హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం భద్రత పెంచడంతో పాటు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కేటాయించినా.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇంకా ప్రగతిభవన్ లోనే ఉండటం గమనార్హం.

 

కాగా ఇటీవల కూడా ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. బీజేపీ కొనుగోలు చేయాలని ప్రయత్నించినా.. అమ్ముడుపోకుండా తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టారంటూ పొగడ్తలు కురిపించారు. ఢిల్లీ నుంచి బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని, వారిని ఎడమకాలితో తన్ని అంగట్లో సరుకులు కాదమని చాటి చెప్పారని కేసీఆర్ తెలిపారు. తాము తెలంగాణ బిడ్డలమని చాటిచెప్పి తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయ పర్వతంమంత ఎత్తు ఎత్తారని కేసీఆర్ ప్రశంసించారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -