KCR: సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్.. ఆ సీట్లు మనవేనంటూ?

KCR: రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు మరో ఏడాది పాటు సమయం ఉన్నప్పటికీ ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి కనపడుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో వచ్చే ఎన్నికలలో కూడా విజయం సాధించాలని బి.ఆర్.ఎస్ పార్టీ కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే బుధవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేతలందరూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ బి.ఆర్.ఎస్ నాయకులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా మనమే అధికారంలోకి వస్తామని విషయంలో ఎవరు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.ఇప్పటివరకు ఎన్నికల ఫలితాలపై నిర్వహించిన సర్వేలన్నీ కూడా మనకి అనుకూలంగా ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో మన పార్టీకి 95 నుంచి 105 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు.

 

నేను చెప్పిన విధంగా ఎమ్మెల్యేలందరూ పనిచేసి నడుచుకుంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయం అంటూ కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.ఇక రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నానని ప్రభుత్వం చేసిన మంచి పనులను ఎమ్మెల్యేలు ప్రజల దృష్టిలోకి తీసుకు వెళ్లడంలో చాలా విఫలమయ్యారని కెసిఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ప్రజలను పిల్లల కోడిలా అందరిని కాపాడుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

 

అందుకే తాను చెప్పినట్లు ప్రతి ఒక్క ఎమ్మెల్యే నడుచుకొని ప్రజలలోకి వెళ్లాలని సూచించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పార్టీ నేతలు అందరిని కలుపుకొని ఐక్యతను చాటాలని కెసిఆర్ తెలిపారు. ఏ ఒక్క నాయకుడు కూడా చిల్లర మల్లర రాజకీయాలు చేయకూడదని ఈయన తన పార్టీ నేతలకు సూచించారు. ఇలా కేసీఆర్ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచి తన ఎమ్మెల్యేలను సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికి వచ్చే ఎన్నికలలో టికెట్లు తప్పనిసరిగా ఉంటాయని కేసీఆర్ పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఐప్యాక్ స్క్రిప్ట్ ను సీఎం జగన్ ఫాలో అవుతున్నారా.. స్క్రిప్ట్ ప్రకారమే సామాన్యుల్ని కలుస్తున్నారా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బస్సు యాత్రకు భారీ స్పందన వస్తుంది...
- Advertisement -
- Advertisement -