CM KCR: జాతీయ పార్టీపై మళ్లీ వెనక్కి తగ్గిన కేసీఆర్.. కొత్త ముహూర్తం ఎప్పుడంటే?

CM KCR: సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ పెడుతున్నట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. కానీ పార్టీ ప్రకటన మాత్రం అధికారికంగా చేయలేదు. పార్టీ పేరు, జెండా, గుర్తు మాత్రం ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తారంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. దసరాకు కేసీఆర్ కొత్త జాతీయ ప్రకటన చేస్తారని, దాని గురించే చర్చలు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. పార్టీకి సంబంధించిన విధివిధానాలను తయారుచేయించే పనిలో ఉన్నారని, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. రైతు అజెండగానే కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఉంటుందనే వార్తలు మీడియాలో వినిపించాయి.

కొత్త జాతీయ పార్టీ విధివిధానాలు, పార్టీ పేరు, గుర్తు, జెండా తయారు చేసే పనులపై ఓ ప్రత్యేక బృందాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతూ కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చలు జరుపుతున్నారు. దసరాకు కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని అందరూ భావించారు. కానీ కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది. దసరాకు పార్టీ ప్రకటన ఉండదని సమాచారం. దసరాకు పార్టీ ప్రకటన కష్టమేనని తెలుస్తోంది.

డిసెంబర్ లో కొత్త పార్టీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ పేరు, జెండా, గుర్తు, విధివిధానాల పనులు పూర్తి అయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేయించుకవాల్సి ఉంటుంది. ఈసీ నుంచి అనుమతులు రావడానికి కొద్దిరోజులు సమయం పడుతుంది. ఈసీ నుంచి అనుమతి వచ్చిన తర్వాత కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని సమాచారం. అలాగే ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో కొత్త జాతీయ పార్టీ ప్రకటిస్తే ప్రజల్లో కన్ ప్యూజన్ ఏర్పడే అవకాశముంది. దీంతో కొత్త పార్టీ పనులు పూర్తయిన తర్వాత, మునుగోడు ఉపఎన్నికలు పూర్తయిన తర్వాత డిసెంబర్ లో కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.

నవంబర్ లో లేదా డిసెంబర్ లో మునుగోడు ఉపఎన్నికలు జరిగే అవకాశముంది. అందుకే డిసెంబర్ లో కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. డిసెంబర్ లో అయితే బాగుంటుందని కొంతమంది సీనియర్ నతలు కేసీఆర్ కూ సూచించారట. దీంతో కేసీఆర్ కూడా డిసెంబర్ లో అయితే బాగుంటుందని భావిస్తున్నారట. ఇక కొత్త జాతీయ పార్టీలో ఎలాంటి హామీలు ఇవ్వాలని దానిపై కూడా చర్చోపర్చలు జరుగుతుననాయి. తెలంగాణ మోడల్ దేశానికి కావాలని కేసీఆర్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీంతో తెలంగాణలోని పథకాన్ని దేశంలో హామలు చేస్తామని హమీ ఇవ్వనున్నారు.

దేశంలో మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, దేశవ్యాప్తంగా రైతులకు 24 గంటలు ఉచిత హామీ ఇస్తామని కేసీఆర్ ఇటీవల బహిరంగ సభలో ప్రకటించారు. దీంతో వ్యవసాయానికకి 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు రైతుబంధు, రైతుబీమా అనే అంశాలపై హామీ ఇవ్వనున్నారు. కొత్త పార్టీ ప్రకటించిన తర్వాత జనవరిలో యూపీ, పంజాబ్ లో కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించే అవకాశముంది.

అలాగే టీఆర్ఎస్ పార్టీని కొత్తగా ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీలో విలీనం చేసేందుకు తీర్మానం చేయాలని టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. పార్టీ కార్యనిర్వాహక సభ్యలు ఆమోదం తీసుకున్న తర్వాత అది ఎన్నికల కమిషన్ కు సమర్పించాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలా లేదా జాతీయ పార్టీని వేరేగా నడపారా అనే దానిపై కేసీఆర్ ఇంకా ఎలాంి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కొత్త జాతీయ పార్టీ ప్రకటన మరింత ఆలస్యం కానుంది.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -