KTR: కేసీఆర్ కొడుకు పెళ్లి ఫోటోలు వైరల్..రామన్న పెళ్లి ఫోటోలు అదుర్స్

KTR: తెలుగు ప్రజలందరూ మెప్పే నాయకుడు కేటీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ తెర మీదకు వచ్చారు. ఉద్యమంలో తన తండ్రి కేసీఆర్ తో పాటు అడుగులు వేశారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత ఎన్నికల్లో విజయం పొంది మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కేటీఆర్..టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు.

 

రాజకీయాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ కేటీఆర్ యాక్టీవ్ గా ఉంటారు. రాజకీయాల గురించే కాకుండా తన దృష్టికి వచ్చిన సమస్యలపై ఆయన స్పందిస్తుంటారు. మంచి విషయాలను ఆయన తప్పక ప్రశంసిస్తుంటారు. తాజాగా కేటీఆర్‌కు సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేడు కేటీఆర్‌ పెళ్లి రోజు సందర్భంగా ఆనాటి పెళ్లి ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. 1976లో జన్మించిన కేటీఆర్ అమెరికాలో ఎంబీఏ చదివారు. ఆ తర్వాత అక్కడే కొన్ని రోజులు ఉద్యోగం చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్రం అవుతున్న టైంలో 2006లో కేటీఆర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో పాల్గొంటూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు.

 

2003 డిసెంబర్ 18వ తేదిన శైలిమను కేటీఆర్ పెళ్లి చేసుకున్నారు. నేడు వారి 19వ పెళ్లి రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా కేటీఆర్‌ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి కొడుకు గెటప్‌లో కేటీఆర్‌ని చూసిన నెటిజనులు రామన్న ఎంత అందంగా ఉన్నావ్‌ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కేటీఆర్, శైలిమ దంపతులకు హిమాన్షు రావు, అలేఖ్య రావు అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం హిమాన్షు కూడా సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటూ ప్రజలకు టచ్ లోనే ఉంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -