5G Smartphone: 5–జీ ఫోన్‌ కొంటున్నారా.. ఇవి గుర్తించుకోండి!

5G Smartphone: 5జీ వేలం ప్రక్రియ కంప్లిట్‌ కావడంత త్వరితగతిన ఆ సేవలు మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు టెలికాం కంపెనీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. మొదటగా నగరాల్లో ప్రారంభించి ఆ తర్వాత పట్టణాల్లోఅందుబాటులోకి తీసుకురానున్నారు. .ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్‌ అది ఒక్కటే. ఏ ఫోన్‌ కొంటే మంచిగా ఉంటుందనే.. ప్రస్తుతం మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నట్ల అయితే 5–జీ ఫోన్‌ కొనాలనే ఆలోచనను కొన్ని రోజులు పక్కకు పెడితే మంచిది. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో ఉంటున్నట్లు ఐతే 5–జీ ఫోన్‌ కొనుగోలు చేసే కన్నా ముందు దానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తక్కువ ధరకే 5–జీ ఫోన్‌ వస్తుందని ఎగబడి కొంటే ఆ డబ్బులన్నీ నీటిపాలైనట్టే.

బ్యాండ్లు ఇలా..

ఒకవేళ మీరు 5–జీ ఫోన్‌ కొనేముందు ఏ టెలికాం కంపెనీ.. ఏ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసిందో క్షుణ్నంగా తెలుసుకోవాలి. మొత్తం 10 బ్యాండ్లను వేలానికి ఉంచగా రిలయన్స్‌ జియో 700 ఎమ్‌హెచ్‌జడ్, 800ఎమ్‌హెచ్‌జడ్, 1800 ఎమ్‌హెచ్‌జడ్,3300ఎమ్‌హెచ్‌జడ్, 26జీహెచ్‌జడ్‌ బ్యాండ్లలో 27.740 గిగాహెర్జ్‌ స్పెక్ట్రాన్ని వేలంలో దక్కించుకుంది. అయితే ఏయిర్‌టెల్‌ 900 ఎమ్‌హెచ్‌జడ్,1800ఎమ్‌హెచ్‌జడ్, 2100ఎమ్‌హెచ్‌జడ్, 3300ఎమ్‌హెచ్‌జడ్, 26 జీహెచ్‌జడ్‌ దక్కించుకోగా..వొడాఫోన్‌ ఐడియా 1800 ఎమ్‌హెచ్‌జడ్, 2100ఎమ్‌హెచ్‌జడ్, 2500ఎమ్‌హెచ్‌జడ్, 3300ఎమ్‌హెచ్‌జడ్, 26 జీహెచ్‌జడ్‌ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 6.22 జీహెచ్‌జడ్‌ స్పెక్ట్రాన్ని కొలుగోలు చేసింది.

తప్పకుండా ఇవి చూడాలి..

మార్కెట్‌ లో 5జీ ఫోన్ల సందడి ఈ మధ్య జోరుగా కనిపిస్తోంది. ఇప్పడొస్తున్న స్మార్‌ట ఫోన్లలో దాదాపు అన్ని ఫోన్లూ 5–జీకి సపోర్ట్‌ చేస్తున్నాయి. అలాగని ఫోన్లలో ఉండే చిప్‌ సెట్లూ అన్ని బ్యాండ్లకూ సపోర్ట్‌ చేయకపోవచ్చు. కాబట్టి మీరు కొనుగోలు చేయబోయే ఫోన్‌ అన్ని బ్యాండ్లకూ సపోర్ట్‌ చేస్తుందో లేదో చూసుకోవాలి. ఆయా కంపెనీలు ఏయే బ్యాండ్లకు తమ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుందో ‘ఎన్‌’ అనే అక్షరంతో అది సపోర్ట్‌ చేసే బ్యాండ్ను సూచిస్తుంది.

జియో, ఎయిర్టెల్, వొడాఫోన్‌ కొనుగోలు చేసిన బ్యాండ్లను ఈ విధంగా చూసినప్పుడు.. 700 ఎమ్‌హెచ్‌జడ్‌ (ఎన్‌28), 800 ఎమ్‌హెచ్‌జడ్‌ (ఎన్‌20), 900 ఎమ్‌హెచ్‌జడ్‌ (ఎన్‌8), 1800 ఎమ్‌హెచ్‌జడ్‌ (ఎన్‌3), 2300 ఎమ్‌హెచ్‌జడ్‌ (ఎన్‌30/ఎన్‌40), 2500 ఎమ్‌హెచ్‌జడ్‌ (ఎన్‌41), 3300 ఎమ్‌హెచ్‌జడ్‌ (ఎన్‌78), 26 జీహెచ్‌జడ్‌ (ఎన్‌258)గా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న రూ. 20 వేల రూ. 30 వేలకు లభించే ఫోన్లన్నీ అన్ని బ్యాండ్లకూ సపోర్ట్‌ చేస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -