M. M. Keeravani: నాటు నాటు సాంగ్ పరువు తీసేసిన కీరవాణి.. ఏం జరిగిందంటే?

M. M. Keeravani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా ఎంత పేరు పెద్దలు సంపాదించుకున్న ఎం ఎం కీరవాణి సినీ ప్రస్థానం గురించి మనకు తెలిసిందే. ఇక ఈయన సంగీత సారధ్యంలో వచ్చిన నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా రావడం విశేషం. ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో భాగంగా ఈ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ పాట గురించి కీరవాణి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కీరవాణి ప్రముఖ కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో కలసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆస్కార్ వెనుక నాటు నిజం పేరిట ఈ ఇంటర్వ్యూ కొనసాగింది. ఇంటర్వ్యూలో భాగంగా వర్మ కీరవాణి గారిని తనదైన స్టైల్ లో ప్రశ్నలు అడిగారు. నాటు నాటు పాటకు మ్యూజిక్ డైరెక్టర్ గా మీరు కాకుండా మరే ఇతర డైరెక్టర్ పనిచేసిన ఆస్కార్ పొందే అర్హత పాటకు ఉందని మీరు ఫీల్ అయ్యేవారా అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు కీరవాణి సమాధానం చెబుతూ ఈ పాటకు ఆస్కార్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు.

కేవలం ఒక పాటగా మాత్రమే తీసుకుంటే నేను ఫీల్ అవ్వను ఎందుకంటే జయహో పాటకు ఆస్కార్ వచ్చినప్పుడు కూడా తాను ఫీల్ అవ్వలేదని కీరవాణి తెలిపారు. నాటు నాటు పాట మీ కెరియర్ లో టాప్ 100 పాటలలో ఒకటిగా ఉందా అనీ వర్మ ప్రశ్నించగా…కీరవాణి సమాధానం చెబుతూ మనం ఏదైనా క్రియేటివ్ గా చేయాలి అనుకున్నప్పుడు అది అవతల వారికి నచ్చాలి అంటే ముందుగా మనకు నచ్చాలి.

 

మనకే నచ్చనప్పుడు అవతల వారికి ఎలా నచ్చుతుందనుకుంటాము అంటూ కామెంట్ చేశారు. ఇలా కీరవాణి గారు నాటు నాటు పాట గురించి వర్మ అడిగిన ప్రశ్నలకు ఇలాంటి సమాధానాలు చెప్పడం చూస్తుంటే నాకు నాటు పాట కన్నా తన సంగీత సారథ్యంలో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయని తెలుస్తుంది. ఇలా ఈ పాట గురించి కీరవాణి గారు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -