Keeravani: కీరవాణి సంచలన వ్యాఖ్యలు.. నాటు నాటు సాంగ్ గురించి అలా చెప్పారా?

Keeravani: డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న మూవీ ఆర్ఆర్ఆర్. ఇక ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో గుర్తింపులు అందుకుంది. ఇప్పటికీ ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఇక ఇటీవలే నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కూడా అందుకుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఓ రేంజ్ లో గర్వంగా ఫీల్ అవుతుంది.

 

ఇక ఈ పాటకు అద్భుతమైన స్టెప్పులు వేశారు చరణ్, ఎన్టీఆర్. ఇక ఆస్కార్ అవార్డు అందుకున్నందుకు ఈ హీరోల ఫ్యామిలీతో పాటు రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీ కూడా బాగా సందడి చేస్తున్నారు. అయితే తాజాగా కీరవాణి తండ్రి శివశక్తి దత్త కూడా కొన్ని విషయాలు పంచుకున్నాడు. తన కొడుకు కీరవాణి ఉన్నతని చూసి గర్వంగా పొంగిపోయాడు.

 

అయితే అందులో ఆయన నాటు నాటు పాటపై ఘాటు వ్యాఖ్యలు చేయటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. తనకు సినిమా అంటే ఫ్యాషన్ అని.. తము నలుగురు అన్నదమ్ములమని.. తమంత తుంగభద్ర ఏరియా కు వలస వెళ్ళాము అని.. అయితే అక్కడ 16 సంవత్సరాలు ఉన్నామని అన్నాడు. అంతేకాకుండా అక్కడ 300 ఎకరాలు కొన్నాను అంటూ కానీ సినిమా కోసం భూమిని అంత అమ్మేశాను అని.. చివరికి ఈరోజు పూట గడవడం ఎలా అన్న పరిస్థితికి వచ్చాము అని తెలిపాడు.

ఆ సమయంలో విజయేంద్రప్రసాద్, తను కలిసి మంచి కథలు రాశాము అని.. అలా ఎన్నో హిట్ సినిమాలకు తమ పని చేశాము అని.. కానీ.. అప్పటివరకు కీరవాణి దగ్గర పని చేస్తే వచ్చిన డబ్బుతో ఇల్లు గడిచేది అని తెలిపాడు. ఇక కీరవాణి తనకు పంచప్రాణాలు అంటూ.. మూడో ఏట నుంచి అతడికి సంగీతం నేర్పాను అంటూ.. తన టాలెంట్ చూసి ఎప్పుడు ఆశ్చర్యపోతుంటాను అని అన్నాడు.

 

ఇక ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాట తనకు నచ్చలేదు అంటూ డైరెక్ట్ కామెంట్ చేసి షాక్ ఇచ్చాడు. అసలు అది ఒక పాటేనా అంటూ.. ఛండాలంగా ఉంది.. అందులో సంగీతం ఎక్కడుంది.. విధి విచిత్ర వైచిత్రం ఇది.. కానీ ఇన్నాళ్లు అతడు చేసిన కృషికి ఈ రూపంలో ఫలితం వచ్చింది అంటూ.. అయితే చంద్రబోస్ రాసిన 5000 పాటల్లో ఇది ఒక పాటా అంటూ.. కీరవాణి ఇచ్చిన సంగీతంలో ఇదొక మ్యూజికేనా అంటూ ప్రశ్నించాడు. ఇక ఏ మాటకే ఆ మాట అంటూ.. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ మాత్రం అద్భుతంగా ఉంది అని.. ముఖ్యంగా తారక్, చరణ్ డాన్స్ మహా అద్భుతంగా ఉంది అని.. వీళ్ళ కృషి వల్ల ఆస్కార్ దక్కడం గర్వించదగ్గ విషయం అని ప్రశంసలు కురిపించాడు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కు ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచన లేదా.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ హవానే...
- Advertisement -