Keerthi Suresh: పెళ్లికి సిద్ధమైన మహానటి కీర్తి.. ట్విస్ట్ ఏంటంటే?

Keerthi Suresh: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వయసు ప్రస్తుతం 30 ఏళ్లు దాటింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెంచుతున్నారట. చేసేదేం లేక కీర్తి సురేష్ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో కీర్తి సురేష్‌ను పెళ్లి చేసేయాలని ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నారట. ఈ క్రమంలో కొన్నేళ్లుగా వరుడి వెతికే పనిలో నిమగ్నమయ్యారు. కీర్తికి సెట్ అయ్యే అబ్బాయిని ఎంపిక చేశారట. అబ్బాయి కూడా కీర్తికి కూడా నచ్చాడట. దాంతో త్వరలో పెళ్లి చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో పెళ్లి ప్రకటన కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

 

 

అయితే పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదని కండీషన్ కూడా పెట్టారట. దాంతో ప్రస్తుతం ఓకే చెప్పిన సినిమాలు పూర్తి చేసి.. త్వరలో వెండి తెరకు గుడ్ బై చెబుతున్నట్లు సమాచారం. ఓ వైపు పెళ్లి సంతోషం ఉన్నప్పటికీ.. సినిమాల నుంచి తప్పుకుంటుందని తెలిసి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ వార్తలో ఎంత వాస్తవముందనే విషయంపై క్లారిటీ లేదు. గతంలో కూడా కీర్తి పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగాయి. అయితే అవి పుకార్లకే పరిమితమయ్యాయి. కానీ ఈ సారి నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

 

బాలనటిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. 2013లో విడుదలైన మలయాళం మూవీ ‘గీతాంజలి’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్‌లో ‘నేను శైలజ’ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి, మిస్ ఇండియా, రంగ్ దే, పెద్దన్న, సర్కారు వారి పాట’ సినిమాలో నటించింది. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో ‘భోళా శంకర్, దసరా’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించనుంది. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Reddy: కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్.. కిరణ్ కుమార్ రెడ్ది సంచలన వ్యాఖ్యలు వైరల్!

Kiran Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కిరణ్ కుమార్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలలో నేడు ఈ స్థాయిలో...
- Advertisement -
- Advertisement -