IPL: ఐపీఎల్‌కు కేన్ మామ దూరం.. గుజరాత్ టైటాన్స్‌కు ఆదిలోనే షాక్

IPL: ఐపీఎల్ ప్రారంభంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ షాక్ తిగిలింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య శుక్రవారం ఈ సీజన్ తొలి ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్బంగా ఫీల్డింగ్ చేసే సమయంలో కేన్ మామ గాయపడ్డాడు. గాయం పెద్దది కావడంతో ఐపీఎల్ మ్యాచ్‌లకు కేన్ విలియమన్స్ దూరమయ్యాడు.

ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సమయంలో కేన్ విలియమన్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కాలికి గాయమైంది. దీంతో కేన్ మామ స్థానంలో సాయి సుదర్శన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్‌కు పంపింది. అతడు బాగానే ఆడటంతో ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు గెలిచింది.

 

అయితే కేన్ విలియమ్సన్‌కు వైద్య పరీక్షలు చేసిన అనంతరం.. కొన్ని రోజులు రెస్ట్ అవసరమని డాక్టర్ల బృందం సూచించింది. దీంతో ఈ ఐపీఎల్ మొత్తానికి కేన్ మామ దూరమయ్యాడు. విలియమ్సన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు గుజరాత్ టైటాన్స్ తెలిపింది. అయితే మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ విలియమ్సన్ ను రూ.2 కోట్లకు తీసుకుంది. గత కొన్నేళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా విలియమ్సన్ బాధ్యతలు చేపట్టాడు. కానీ గత ఏడాది సన్ రైజర్స్ నుంచి కేన్ మామ బయటకొచ్చాడు.దీంతో మినీ వేలంలో విలియమ్సన్ ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. మిడిలార్డర్‌లో జట్టుకు ఉపయోగపడతాడని గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. కానీ గాయంతో ఐపీఎల్ కు దూరం కావడంతో ఆదిలోనే గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది కప్ ను గెలుచుకున్న గుజరాత్.. ఈ సారి కూా అదే జోరును కొనసాగించి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకోవాలని చూస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -