Viral Video: ఎర్రచీర కట్టుకుని గుంతల రోడ్లపై పెళ్లి కూతురు ఫొటోషూట్‌?

Viral Video: ప్రస్తుత కాలంలో పెళ్లి కుదిరిందంటే ముందుగా ప్రి వెడ్డింగ్‌తో సందడి చేస్తున్నారు. అమ్మాయి, అబ్బాయి వారికి ఇష్టమైన ప్రాంతాల్లో రూ. లక్షల్లో ఖర్చుచేసి ఫొటోషూట్‌ తీసుకుంటున్నారు. వారివారికున్న స్థోమతను బట్టి ఫొటో షూట్‌లు చేసుకుంటున్నారు. అయితే ఓ కొత్త పెళ్లి కూతురు ఫొటో షూట్‌ మాత్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేలా చేసింది. ఇంతకి ఆమె ఎక్కడ ఫొటో షూట్‌ తీసుకుందో మనం తెలుసుకుందాం.

కేరళలో ఓ యువతి పెళ్లి రోజు ఫొటోషూట్‌ తీసుకోవాలని నిర్ణయించుకుంది. కల్యాణ మండపం దగ్గర కాకుండా మరో ప్రాంతంలో ఫోటోలు తీసుకుంటానని పెళ్లి కూతురు ఫొటోగ్రాఫర్‌ కు చెప్పింది. పెళ్లి కూతురు ఇంట్లో అందంగా రెడీ అయ్యింది.ఎర్ర చీర కట్టుకుని, నగలు వేసుకొని గుంతలు పడిన రోడ్డు మీదకు వచ్చింది. నడిరోడ్డులో విపరీతంగా గుంతలు పడటం, వర్షం నీరంతా ఆ గుంతల్లో చేరింది. ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ పెళ్లి కూతురు ఫొటోషూట్‌లో పాల్గొనింది. పెళ్లికూతురు గుంతల రోడ్డు మీద తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో బాగా వైరల్‌ కావడంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ లో 43 లక్షల మంది ఆ ఫొటోలు చూడగా 3.7 లక్షల మంది లైక్‌లు కొట్టారు.

పెళ్లి కూతురు ఆమె ఉంటున్న ప్రాంతంలోని సమస్యల గురించి ప్రభుత్వ పెద్దలకు తెలిసేలా ఇలా ఫొోటోషూట్‌లో పాల్గొనడంతో అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. కేరళ ప్రభుత్వం నిద్రపోతుంది , కేరళలో ప్రభుత్వం ఉందా..లేదా? అని కొందరు ఇలా కేరళ ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. కొందరు అయితే రోడ్ల మీద పడిన గుంతల్లో హ్యాపీగా చేపలు పెంచుకోవచ్చని, మంచి లాభాలు కూడా వస్తాయని కొందరు కామెంట్లు చేశారు. మొత్తం మీద కొత్తపెళ్లికూతురు దెబ్బతో ఆ రోడ్లు బాగుపడుతాయని కొందరు కామెంట్లు చేశారు. కొత్త పెళ్లికూతురు ప్రభుత్వ పెద్దల కళ్లు తెరిపించిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎలా ఎవరికి వారే తమదైన శైలిలో పెళ్లి కూతురును సపోర్ట్ చేస్తూ కామెంట్లు గుప్పిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Sai Dharam Tej-Swathi: సాయితేజ్, స్వాతిరెడ్డి మధ్య అలాంటి బంధం ఉందా.. విడాకుల వెనుక ట్విస్టులు ఉన్నాయా?

Sai Dharam Tej-Swathi:స్వాతి రెడ్డి, సాయి ధరమ్ తేజ్ ని స్టేజిపై ఒరేయ్ అని పిలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన సంఘటన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్లో జరిగింది....
- Advertisement -
- Advertisement -