Bumrah: బుమ్రా స్థానంలో ముంబై జట్టులోకి కేరళ పేసర్

Bumrah: ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభమై రెండు రోజులు అవుతుంది. భారీ సిక్సర్లు, ఫోర్లతో బ్యాట్స్‌మెన్లు ఫ్యాన్స్‌కు బోల్డెంత వినోదాన్ని అందిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఈ సారి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సారి ఐపీఎల్‌లోకి కొత్త టీమ్‌లు రావడం, ఆటగాళ్లు వేరే వేరే జట్టుల్లోకి మారడంతో మరింత థ్రిల్‌ను అందిస్తోంది.

అయితే గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్‌ను ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. ఐపీఎల్‌లో ముంబై తరపున బూమ్రా ఆడుతున్నాడు. అతడు దూరం కావడం ముంబై ఇండియన్స్ జట్టుుకు కాస్త ఇబ్బందే అని చెప్పవచ్చు. కానీ బుమ్రా స్థానంలో కొత్త పేసర్‌ను ముంబై తీసుకుంది. కేరళ ఫాస్ట్ బౌలర్ సందీప్ వారియన్ ను జట్టులోకి తీసుకుంది. గతంలో 2021లో శ్రీలంకతో జరిగిన ఓ టీ 20 మ్యాచ్‌లో సందీప్ ఆడాడు. అతడికి మంచి రికార్డులు కూడా ఉన్నాయి.

 

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇప్పటివరకు 66 మ్యాచ్ లలో 217 వికెట్లు తీశాడు. అలాగే 68 టీ20 మ్యాచ్ లలో 62 వికెట్లు పడగొట్టాడు. కెరీర్ ప్రారంభంలోనే కేరళ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అతడు.. 2020 నుంచి తమిళనాడు తరపున ఆడుతున్నాడు. బుమ్రా స్థానాన్ని సందీప్ భర్తీ చేయగలుగుతాడా? వికెట్లను తీస్తాడా? జట్టుకు ఉపయోగపడతాడా? లేదా? అనేది చూడాలి.

 

అయితే ఈ ఐపీఎల్ లో చాలామంది గాయాల కారణంగా మ్యాచ్ లకు దూరమవుతున్నారు. స్టార్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. దీంతో ఐపీఎల్ మ్యాచ్ లకు రిషబ్ పంత్ దూరమయ్యాడు. దీంతో రిషబ్ పంత్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇషాన్ పోరెల్‌ను తీసుకుంది. ఇక బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ గాయం కారణంగా తొలి ఏడు మ్యాచ్ లకు దూరం కానున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -