Kerala: టీలో ఎలుకల మందు కలిపి తల్లిని చంపేసిన కిరాతకురాలు!

Kerala: నేటి సమాజంలో డబ్బు కోసం ఏదైనా చేస్తున్నారు. డబ్బు వస్తుందంటే చిన్నా పెద్ద వాయువరసలు, చూడకుండా చంపేందుకు హత్య చేసేందుకు కూడా వెనకాడటం లేదు. జల్సాల కోసం కొందరైతే ఆస్తీ కోసం మరి కొందరు తమ కుటుంబ సభ్యులను నిర్ధాక్షిణంగా చంపేస్తున్నారు. డబ్బుకు ఆశపడి చేస్తున్న నేరాలతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు శత్రువులు బయట ఉండేవారు. నేటి కాలంలో మన వాళ్ల మనకు శత్రువులుగా మారుతున్నారు. ఆస్తి దక్కించుకోవాలని ఓ కన్న కూతురు తల్లిదండ్రులనే చంపేసేందుకు వేసిన ప్లాన్‌లో తల్లి మృతి చెందగా తండ్రి తృటిలో తప్పించుకున్నాడు. కన్న తల్లిని చంపిన దుర్ఘటనలో కేరళలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి..

కేరళ, త్రిస్సూర్‌ జిల్లాకు చెందిన ఇందులేఖ అనే మహిళ భర్త విదేశాల్లో ఉంటున్నాడు. గతంలో అతడు తెలిసిన వారి వద్ద ఇష్టానుసారంగా అప్పులు చేశాడు. అప్పిచ్చిన వారు తిరిగి ఇవ్వమని అడుగుతండగా అందరికి డబ్బులుఇవ్వలేక గత కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురవుతున్నాడు. త్వరలోనే స్వదేశానికి వస్తున్నట్లు భార్య ఇందులేఖకు తెలిపాడు.తన భర్త చేసిన అప్పులు ఎలాగైన తీర్చాలనుకున్న ఇందులేఖ ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే తన తల్లిదండ్రులపై ఉన్న ఆస్తులన్నీంటిని సొంతం చేసుకుంటే తమ అప్పులు సునాయసంగా తీర్చుకోవచ్చని భావించింది. అనుకున్నది తడువుగానే ప్లాన్‌ వేసుకుంది.ఎలాగైనా తల్లిదండ్రుల్ని చంపి, ఆస్తిని దక్కించుకోవాలనుకుంది.

అయితే వారిని ఎలా చంపాలో అని ముందుగా ఎలుకల మందు పెడితే ఎలా ఉంటాది అని గూగుల్‌ సెర్చ్‌ చేసింది. ఎలుకల మందుతో కూడా మనుషుల ప్రాణాలు పోతాయని తెలుసుకుని ఆ ప్లాన్‌ను అమలు చేయాలనుకుంది. ఓ సాయంత్రం ఇంట్లో టీ తయారు చేసే క్రమంలో అందులో ఎలుకల మందు ఎక్కువ మోతాదులో కలిపి తల్లి, తండ్రికి ఇచ్చింది. ఎలుకల మందు కలిసిన టీని ఇందులేఖ తల్లి తాగేసింది. చేదుగా ఉందని తండ్రి టీని తాగకుండా వదిలేశాడు. విషం ఉన్న టీ తాగిన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆమె మృత్యువాత పడింది. అనుమానం వచ్చిన వైద్యులు పోస్టుమార్టం చేయగా శరీరంలో విషం ఎక్కడంతో చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీసులు ఇందులేఖను తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెల్లగక్కింది. ఆస్తికోసమే దారుణానికి ఒడిగట్టినట్లు ఇందులేఖ పోలీసుల ముందు వెల్లడించింది. తండ్రి అదృష్టం బాగుండి టీ తాగకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -