Keshineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎంపీ పోటీ నుంచి తప్పకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీకి గుడ్ బై చెప్పి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోకి దిగేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయవాడ ఎంపీగా 2014,2019 ఎన్నికల్లో కేశినేని నాని గెలిచారు. రెండుసార్లు ఎంపీగా పనిచేయడంతో.. ఈ సారి ఆసక్తి చూపడం లేదు. అసెంబ్లీకి పోటీ చేయాలని ఆయన అనుకుంటున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంపై ఆయన కన్నేసినట్లు చెబుతున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా సీనియర్ నేత గద్దె రామ్మోహన్ ఉన్నారు.
అయితే ఈ సారి ఆయన గన్నవరం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో గద్దె రామ్మెహన్ విజయవాడ ఎంపీగా పనిచేశారు. దీని వల్ల ఆయనకు విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలపై పట్టు ఉంది. దీంతో గన్నవరం నుంచి పోటీ చేసేందుకు గద్దె రామ్మోహన్ ఆసక్తి చూపుతన్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును గద్దె రామ్మెహన్ కలిశారు. దీంతో దీని గురించే మాట్లాడేందుకు చంద్రబాబును గద్దె రామ్మోహన్ కలిసినట్లు చెబుతున్నారు.
వైసీపీ నుంచి దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసే అవకాశముంది. దీంతో దేవినేని అవినాష్ పై గద్దె రామ్మోహన్ సులువుగా గెలిచే అవకాశముంది. గత ఎన్నికల్లో కొడాలి నానిపై గుడివాడ నుంచి దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అవినాష్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి అవినాష్ కు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. విజయవాడ ఎంపీగా వచ్చే ఎన్నికల్లో కేశినేని ఆసక్తి చూపకపోవడంతో ఆయన సోదరుడు కేశినేని చిన్నిని చంద్రబాబు బరిలోకి దింపారు.
ఇటీవల టీడీపీలో కేశినేని చిన్న కీలకంగా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో కూడా ఇటీవల వంగవీటి చిన్ని బేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కేశినేని చన్నినే పోటీలోకి దింపేందుకు చంద్రబాబు కూడా ఆసక్తి చూపుతున్నారు. విజయవాడలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుర్ మీరా, దేవినేమి ఉమా లాంటి నేతలతో కేశినేని నానికి విబేధాలు ఉన్నాయి. దీంతో విజయవాడ ఎంపీగా పోటీ చస్తే వాళ్లు సహకరించే పరిస్థితి లేదు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత మేయర్ గా బరిలోకి దిగింది. కానీ బుద్దా వెంకన్న, దేవినేని ఉమా, నాగుర్ మీరా వంటి కీలక నేతలు మద్దతు తెలపడలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తే పార్టీలోని ప్రత్యర్థధులు సహకరించే అవకాశాలు లేవు. అందుకే అసెంబ్లీకి కేశినేని పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.