Balayya-Kethireddy: బాలయ్యకు ఛాలెంజ్ విసిరిన కేతిరెడ్డి.. మీకు అభ్యర్థులే లేరంటూ?

Balayya-Kethireddy: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే ఇప్పటికే ఎన్నికల హడావిడి కనిపిస్తుంది.అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఈసారి వచ్చే ఎన్నికలలో 175 స్థానాలలో తమ పార్టీ జెండా ఎగరబోతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వచ్చే ఎన్నికలలో అధికార పీఠం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు టార్గెట్ చేస్తూ ఎన్నికల బరిలో దిగుతున్నామని తెలపడంతో ఈ విషయంపై బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలపై కేతిరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో 175 స్థానాల్లో మేము గెలుస్తామనే ధీమా మాకుంది. మరి మీరు కూడా ఎన్ని స్థానాల్లో గెలుస్తారో చెప్పండి అంటూ ఈయన ప్రశ్నించారు.

అసలు మీ పార్టీ తరపున నిలబడటానికి ఎమ్మెల్యేలు కూడా లేరు అంటూ ఈయన తెలియజేశారు.మేము 175 స్థానాలలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాము మరి మీరు కూడా చెప్పండి అంటూ ఈయన సవాల్ విసిరారు. అదంతా కాదు ముందు మీరు మా హిందూపురంలో కాకుండా మీ సొంత ఊరు గుడివాడ వెళ్లి గెలవండి అంటూ సవాల్ విసిరారు.మా రాయలసీమ వాళ్ళు చాలా మంచోళ్ళు ఎవరినైనా మేము హక్కును చేర్చుకుంటాము అదే మీరు గుడివాడ వెళ్లి అక్కడ నిలబడి గెలవండి అని చాలెంజ్ చేశారు.

మీ నాన్న ఎన్టీ రామారావు గారు గుడివాడకు అది చేశారు ఇది చేసారు అని చెబుతుంటారు. ఇదే విషయాలు అక్కడి ప్రజలకు చెప్పి ఎన్నికలలో నిలబడి గెలిచే దమ్ము మీకుందా… అలా ఉంటే గెలిచి చూపించండి అంటూ కేతిరెడ్డి సవాల్ విసిరారు. మెగాస్టార్ చిరంజీవి తన సొంత ఊరిలో ఓడిపోతే రాయలసీమ వాళ్ళు గెలిపించారు. మిమ్మల్ని హిందూపురం ప్రజలు గెలిపించారు.అలా కాకుండా మీరు మీ సొంత ఊరిలో నిలబడి గెలిచి చూపించండి అంటూ కేతిరెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Vanga Geetha: వైసీపీ వంగా గీతకు ప్రజల్లో తిరస్కారం వెనుక అసలు లెక్కలివేనా.. ఏం జరిగిందంటే?

Vanga Geetha: ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అందరూ చూపు పిఠాపురం వైపే ఉంది పిఠాపురంలో కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ కాపు...
- Advertisement -
- Advertisement -