YSRCP is Ready for Elections: వచ్చే ఎన్నికలకు కోసం మాస్టర్ ప్లాన్.. త్వరలోనే వైసీపీ నుంచి కీలక ప్రకటన

YSRCP is Ready for Elections: వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి రెండోసారి సీఎం పీఠం దక్కించుకునేందుకు జగన్ ఇప్పటినుంచే వ్యూహరచనల్లో ముగినిపోయారు. ఇప్పటినుంచే ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఒకవైపు సీఎంగా ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు వైసీపీ ని బలపేతం చేసే దిశగా అడుగులు వేస్తోన్నారు. పార్టీ కార్యక్రమాలను జగన్ మరింత షురూ చేశారు. ఇప్పటికే నియోైజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్న జగన్.. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై శ్రేణులకు పలు కీలక సూచనలు చేస్తోన్నారు. గెలుపు కోసం ఇఫ్పటినుంచే ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. శ్రేణులు అలసత్వం ప్రదర్శించవద్దని, ప్రజల్లో ఉండాలని సూచించారు.

అయితే ప్రస్తుతం ప్రతి నియోకవర్గానికి సమన్వయకర్తలు వైసీపీకి ఉన్నారు. దీంతో అదనపు సమన్వయకర్తలను కూడా నియమించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంలో ఈ జాబితాను ప్రిపేర్ చేయడంపై వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా సిద్దం చేసే పనిలో ఉన్న జగన్.. తుది జాబితాను రెడీ చేశారు. వైసీపీ ముఖ్యనేతలు సిద్దం చేసిన జాబితాకు త్వరలో జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. జగన్ నుంచి ఆమోదం లభించిన తర్వాత వైసీపీ అధిష్టానం నియోజకవర్గాల అదనపు సమన్వయకర్త జాబితాను వైసీపీ వెల్లడించనుంది.

నియోజకవర్గాల్లో జరుగుతున్న వైసీపీ కార్యక్రమాలు, క్యాడర్, కార్యకర్తలు ఏనుకుంటున్నారు.. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారా.. లేదా.. అనే విషయాలను వైసీపీ అధిష్టానానికి పరిశీలకు ఎప్పటికప్పుడు అందించనున్నారు. నియోజకవర్గంలోని వైసీపీ గెలుపు బాధ్యతలను వీరికి అప్పగించనున్నారు. పరిశీలకులుగా నియమించే నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ను కేటాయించే అవకాశం ఉండదు. నియోజకవర్గంలో వైసీపీని గెలిపించే బాధ్యతలను వీరికి కేటాయించనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సహాయంగా వీరిని ఉంచనున్నారని తెలుస్తోంది. చాలాచోట్ల ఇంచార్జ్ లు, ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి కార్యక్రమాలు వాళ్లు చేస్తున్నారు.

దీంతో చాలా నియోజకవర్గాల్లో నేతల విబేధాలు వల్ల పార్టీకి నష్టం జరుగుతోంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు నియోకవర్గాలకు అదనపు సమన్వయకర్తలను నియమించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల్లో ఇంచార్జ్, ఎమ్మెల్యేల విబేధాల వల్ల పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు వచ్చే అవకాశముంది. అదనపు సమన్వయవకర్తలు ఉంటే అధిష్టానానికి తమ గురించి సమాచారం అందిస్తారనే భయంతో వర్గ విబేధాలను వదిలేసే అవకాశం ఉంటుంది. దీని వల్ల వైసీపీ అధిష్టానం నుంచి వచ్చే సమాచారాన్ని, ఎలాంటి వ్యూహలు అమలు చేయాలనే విషయాలను త్వరగా నేతలను చేర్చడానికి అదనపు పరిశీలకులు మధ్యవర్తులుగా ఉండనున్నారు.

పరిశీలకుల ద్వారా క్షేత్రస్ధాయిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుస్తుందని, దీని ద్వారా పరిస్థితుల ఆధారంగా నియోజకవ్గంలో ఎలాంటి వ్యూహం అమలు చేయాలనేది త్వరగా తెలుస్తుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే పరిశీలకుల నియామకంపై కొంతమంది వైసీపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. తమ సొంత నియోజకవర్గంలో తమకు పోటీగా వేరే నేతలను తీసుకురాడం ఏంటి అని కొంతమంది వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. తాము ఉండగా వేరే వారి అవసరం ఏంటని ప్రశ్నిస్తన్నారు. దీని వల్ల తమ సొంత నియోజకవర్గంలో వేరే వారి పెత్తనం ఉంటుందని, తమ పట్ల ప్రజల్లో చులకన భావన ఉంటుందని వైసీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఒక నియోజకవర్గంలో ఇద్దరి పెత్తనం ఉండటం వల్ల వర్గ విబేధాలు మరింతగా రచ్చకెక్కకుతాయని చర్చ వైీసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Ambati Rambabu: చెత్తకుప్పల్లోకి చేరిన వైసీపీ టీ కప్పులు.. ప్రచారం వికటిస్తోందిగా జగన్?

Ambati Rambabu: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసిపి నాయకులకు ప్రచారాల పిచ్చి భారీగా ఉందనే సంగతి మనకు తెలిసిందే. అభివృద్ధి లేకపోయినా ప్రచారం మాత్రం పీక్స్ లో ఉంటుంది. చేసింది...
- Advertisement -
- Advertisement -