KGF: కేజీఎఫ్ నటికి న్యూడ్ వీడియోలు పంపారట.. ఏమైందంటే?

KGF: దక్షిణాది సినిమాల పేరును నలువైపుల వ్యాపించేలా చేసిన కన్నడ సినిమా కేజీఎఫ్. కన్నడలో నిర్మితమైన కేజీఎఫ్ సినిమా.. అన్ని భాషల్లో విపరీతమైన ఆదరణను సంపాదించుకుంది. దీంతో కేజీఎఫ్2కు భారీ డిమాండ్ ఏర్పడగా.. ఈ సినిమా కూడా అందరినీ ఆకట్టుకోవడంతో పాటు భారీగా కలెక్షన్లను రాబట్టింది. కేజీఎఫ్ కన్నా కేజీఎఫ్2కు భారీ కలెక్షన్లు రాగా.. ఈ సినిమాలో రవీనా యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు.

 

 

ఒకప్పుడు బాలీవుడ్ లో ఓ ఊపు ఊపిన రవీనా.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది. ఒకప్పుడు కుర్రకారుకు హీట్ పుట్టించి, వారికి నిద్రలేకుండా చేసిన రవీనా.. ఎన్నోవేధింపులను కూడా ఎదుర్కొంది. తనకు జరిగిన వేధింపుల గురించి రవీనా తాజాగా వివరించింది. అప్పట్లో తనను ఎంతో మంది పిచ్చిగా అభిమానించే వాళ్లని, వారిలో ఒక అభిమాని మరీ దారుణంగా ప్రవర్తించాడని అప్పట్లో తనకు జరిగిన విషాద ఘటన గురించి రవీనా చెప్పుకొచ్చింది.

 

సదరు అభిమాని.. రక్తంతో లవ్ లెటర్స్ రాశాడని, నగ్న వీడియోలు పంపేవాడని రవీనా చెప్పుకొచ్చింది. ఆ అభిమాని ప్రవర్తన వల్ల తాను నరకం చూసినట్లు ఆమె వివరించింది. ఆ అభిమాని చేసిన పనులతో విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని రవీనా పేర్కొంది. ఆ అభిమాని తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించేవాడని. తన ప్రేమని ఒప్పుకోవాలని టార్చర్ పెట్టేవాడని ఆమె వివరించింది.

 

తాను ఫ్యామిలీతో బయటకి వెళ్ళినప్పుడు కారుపై రాయితో దాడి చేశాడని.. తన ప్రేమని ఒప్పుకోవాలని గట్టిగా అరిచాడని ఆమె తెలిపింది. అదే సమయంలో తనకు మీడియా అంటే భయం అని రవీనా పేర్కొంది. తనకు అన్న కావాల్సిన వ్యక్తితో కూడా సంబంధం అంటగట్టారని మీడియా గురించి రవీనా మండిపడింది.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -