Khed: మరో మహిళతో తండ్రి రొమాన్స్.. అలాంటి పని చేసిన కొడుకులు?

Khed: ప్రస్తుతం సమాజంలో వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాలను నాశనం చేస్తున్నాయి. భార్యలు ఇతర పురుషులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటే భర్తలు ఇతర పెళ్లయిన మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలా వారి చేజేతులా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ వివాహేతర సంబంధాలు మోజులో పడి చంపడం ఆత్మహత్యలు చేసుకోవడం వరకు వెళ్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి వివాహేతర సంబంధం మోజులో పడి చివరికి కొడుకుల చేతిలోనే హతం అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పూణేలోని ఖేడ్ ప్రాంతంలో ధనుంజయ నవనాథ్ బాన్సోడ్ అనవే 43 ఏళ్ల వ్యక్తి వ్యాపారం చేసుకుంటూ నివాసం ఉంటున్నాడు.

అతనికి పెళ్లయి చాలా కిందటి సుజిత్, అభిజిత్ అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ధనుంజయ వ్యాపారం చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. సంతోషంగా సజావుగా సాగుతున్న అనుకుంటున్న సమయంలో అతని బుద్ధి వక్రమార్గంలోకి మళ్ళింది. దాంతో అతను సోషల్ మీడియా ద్వారా నాగపూర్ కు చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పరచుకున్నాడు. వారి పరిచయం కాస్త వివాహేతర సంబంధం వరకు దారితీసింది. దాంతో ధనుంజయ తన ప్రియురాలిని కలిసి ఎంజాయ్ చేసేవాడు. అయితే వారి వివాహేతర సంబంధం ధనుంజయ భార్య అతని కొడుకులకు కూడా తెలిసిపోయింది. దాంతో ధనుంజయ బుద్ధి మార్చుకోవాలని కొడుకులు భార్య అనేకసార్లు చెప్పి చూశారు. అయినప్పటికీ ధనుంజయ తన బుద్ధి మార్చుకోకపోవడంతో తాజాగా ధనుంజయతో కొడుకులు ఇద్దరు గొడవకు దిగారు.

ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన కుమారులు ఇద్దరు ధనుంజయను దారుణంగా కొట్టి చంపారు. ఆ తర్వాత మొదటి రోజు తన తండ్రి శవాన్ని ఎవరికి తెలియకుండా ఒక ఫ్యాక్టరీలో కాల్చి చంపేశారు. ఆ తర్వాత నాలుగు రోజులకు తండ్రి కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుమారులు ఇద్దరినీ విచారించగా వాళ్ళు పొంతలు లేని సమాధానాలు చెప్పారు. దాంతో పోలీసులు వారిని గట్టిగా విచారించగా అసలు నిజాన్ని వారు బయట పెట్టేశారు. దాంతో ఆ ఇద్దరు కుమార్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -