Khed: 65 వయసులో ప్రియురాలతో ఉండడం కోసం వృద్ధుడు ప్లాన్.. ఏం చేశాడో తెలుసా?

Khed: దేశవ్యాప్తంగా రోజురోజుకీ వివాహేతర సంబంధాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. వివాహేతర సంబంధాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి కొంతమంది ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడడం లేదు. నిత్యం ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర ఖేడ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో సుభాష్ అనే 65 ఏళ్ల వృద్ధుడు నివసిస్తున్నాడు. సుభాష్ కి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే సుభాష్ గత కొంత కాలం నుంచి స్థానికంగా ఉన్న ఓ వివాహితతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.

 

అలా కొంత కాలం పాటు ఎవరికీ తెలియకుండా ఆ వివాహితతో ఎంజాయ్ చేస్తువచ్చాడు. ఇక రోజు రోజుకి సుభాష్ కి ఆ వివాహితపై మోజు ఎక్కువ అయింది. దాంతో ప్రియురాలితో కలిసి ఎక్కడికైనా హాయిగా వెళ్లి జీవించాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే అతనికి ఒక ఆలోచన కూడా వచ్చింది.
ఒకవేళ తాను దూరంగా వెళ్లిపోతే తన కుటుంబ సభ్యులు తనని వెతుక్కుంటూ వస్తారని అనుకున్న సుభాష్ తాను చనిపోయినట్లుగా కుటుంబం వారిని నమ్మించాలని ఓ మాస్టర్ ప్లాన్ కు తెర తేపాడు. ఇక అందులో భాగంగానే సుభాష్ ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం అతడి శరీర భాగాలు వేరు చేసి ఆ శవానికి సుభాష్ తన బట్టలు తొడిగాడు.

 

ఆ తర్వాత ఆ శవాన్ని సుభాష్ తన పొలంలో పడేసి తన ప్రియురాలిని తీసుకుని దూరంగా వెళ్లిపోయాడు. ఇక తెల్లారేసరికి పొలంలో ఉన్న మృతదేహాన్ని చూసిన అతని కుటుంబ సభ్యులు చనిపోయింది సుభాష్ అనుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక అనంతరం ఆ శవానికి అంత్యక్రియలు కూడా జరిపారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక పోలీసుల దర్యాప్తులో భాగంగా స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించగా చనిపోయింది సుభాష్ కాదని, అసలైన నిందితుడు సుభాష్ అని తేలుసుకున్నారు. అనంతరం ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు సుభాష్ ను అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pareshan Boys: ముస్లిం అయినా వినాయకుని మండపం పెట్టిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్.. మనమంతా సమానమంటూ?

Pareshan Boys: సాధారణంగా ఇతర దేవులను కొలిచేవారు హిందూ దేవుళ్ళ వద్దకు రారు హిందూ దేవుళ్లను నమస్కరించరు. అలాగే హిందూ దేవుళ్లకు నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని కూడా వారు తీసుకోరు. ఇలా హిందువులు...
- Advertisement -
- Advertisement -