Kicha Sudeepp: వామ్మో.. హీరో సుదీప్ అన్ని ఆవులను దత్తత తీసుకున్నారా?

Kicha Sudeepp: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లోనూ సుదీప్‌ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అయితే తాజాగా కిచ్చా సుదీప్ 31 ఆవులను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. పుణ్యకోటి దత్తు యోజన పథకం కింద కర్ణాటక రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో ఒక్క ఆవును దత్తత తీసుకుంటున్నట్లు కిచ్చా సుదీప్ వెల్లడించాడు. అక్రమ పశు రవాణా, గోవధ నుంచి గోవులను కాపాడటమే ధ్యేయంగా కర్ణాటక ప్రభుత్వం ‘పుణ్యకోటి దత్తు యోజన’ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రజల సహకారంతో జిల్లాలవారీగా గోశాలలను ఏర్పాటు చేసి.. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్‌కు కర్ణాటక ప్రభుత్వం కిచ్చా సుదీప్‌ను అంబాసిడర్‌ చేసింది. కాగా, గురువారం కర్ణాటక రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు బి చౌహాన్ ఇంటి దగ్గర గోపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిచ్చా సుదీప్ హాజరయ్యాడు.

 

 

ఈ సందర్భంగా కిచ్చా సుదీప్ ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ..‘గో సంరక్షణ కోసం కర్ణాటక ప్రభుత్వం ఎంతో అద్భుతంగా పని చేస్తోంది. పుణ్యకోటి దత్తు యోజన పథకానికి నన్ను అంబాసిడర్‌గా నియమించడం సంతోషకరంగా ఉంది. దీంతో నా బాధ్యతలు మరింత పెరిగింది. పుణ్యకోటి స్కీమ్‌కు అంబాసిడర్ అవ్వడం గర్వంగా ఉంది. నన్ను అంబాసిడర్‌గా నియమించిన సీఎం బసవరాజ్ బొమ్మై, మంత్రి ప్రభు చౌహాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. గోవులను దత్తత తీసుకోవడానికి రాష్ట్ర ప్రజలు, సినీ ప్రముఖులు ముందుకు రావాలి. గోరక్షణకు అందరూ ముందుకు రావాలి. నా వంతుగా జిల్లాలవారీగా 31 ఆవులను దత్తత తీసుకుంటున్నాను.’ అని వెల్లడించాడు.

 

 

కాగా, కొద్ది నెలల క్రితం సీఎం బసవరాజ్ బొమ్మై తన పుట్టిన రోజు సందర్భంగా ఆవుల దత్తత కార్యక్రమం ‘పుణ్యకోటి’ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం 11 ఆవులను దత్తత తీసుకోగా.. మంత్రి ప్రభు చౌహాన్ 31 ఆవులను దత్తత తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి బాటలోనే కిచ్చా సుదీప్ కూడా ఆవులను దత్తత తీసుకుంటున్నట్ల తాజాగా ప్రకటించాడు. కాగా, సుదీప్ ఈ ఏడాది ‘వీర్ (విక్రాంత్ రోణా)’ సినిమాలో నటించాడు. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం హీరో ఉపేంద్రతో కలిసి ‘కబ్జా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఓటమి భయంతోనే జగన్ కు కోపం.. వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు ఈ క్రమంలోనే కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇటీవల...
- Advertisement -
- Advertisement -