Kidney: మూత్రం ఆ రంగులో వస్తే కిడ్నీలో రాళ్లు వచ్చినట్టే!

Kidney: మానవ శరీరంలో కిడ్నీలు కీలకపాత్ర వహిస్తాయి. శరీంలోని వ్యర్థ పదార్థాలు బయటకు పంపేందుకు కిడ్నీలు ఎంతో సహకరిస్తాయి.అందుకే కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలను వైద్యులు పేర్కొంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు రావడంతో వివిధ రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. నేటి కాలంలో ప్రతి ఇంట్లో ఒకరైన కిడ్నీ సమస్యతో బాధపడేవారు ఉంటున్నారు. కిడ్నీలు శరీరంలోని వ్యర్థాలను తొలగించడంతో పాటు పొటాషియం స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి. ఇంతటి కీలకమైన కిడ్నీల పనితీరులో ఏ చిన్న సమస్య తలెత్తినా వాటిని తేలికగా తీసుకోకూడదు.

అయితే చాలా మంది కిడ్నీ వ్యాధులకు సంబంధించిన లక్షణాలు ముందే పసిగట్టినప్పటికీ అంత శ్రద్ధ వహించరు. సమస్య మొదట్లోనే గుర్తిచి జాగ్రత్తలు తీసుకోకుంటే కిడ్నీల మార్పిడికి దారి తీస్తుంది. మూత్రపిండ వ్యాధులను మూత్రం ద్వారా సులభంగా గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడం, మూత్రంలో రక్తం రావడం, రంగులో మార్పు కనిపించడం వంటివి కనిపిస్తే.. ఇవి కిడ్నీల వ్యాధి ప్రారంభ లక్షణాలుగా గుర్తించాలి. కొన్ని సందర్భాల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్‌ కూడా దారి తీస్తుంది. ఇటువంటి సందర్భంలో వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కు సకాలంలో చికిత్స అందకపోతే చాలా అవయవాలపై ప్రభావం చూపుతోంది.అంతేకాక కొన్నిసార్లు కిడ్నీ ఇన్ఫెక్షన్‌ తీవ్రతరమై మార్చాల్సిన అవసరం కూడా ఏర్పడుతోంది.

అనేక మందికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. వీటి వల్ల కూడా కిడ్నీలకు చాలా నష్టం జరుగుతుంది. అందువల్ల మూత్రానికి సంబంధించిన ఏదైనా లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మూత్రంలో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియా మూత్ర నాళం ద్వారా కిడ్నీకి చేరి, కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. పాదాలలో వాపు ఉండటం కూడా కిడ్నీల వ్యాధికి మరో సూచన. పాదాల్లో తరచూ వాపు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. డయాబెటిస్, గుండె సమస్యలు ఉన్న వారు కూడా కిడ్నీ వ్యాధులపై శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నవ్.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్?

YS Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని చూపిస్తూ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ ఆయన...
- Advertisement -
- Advertisement -