Prayagraj: కన్న కూతురిని చంపి ఆపై కరెంట్ షాక్ పెట్టి అలా?

Prayagraj: ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ ఆత్మహత్యలు హత్యల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. మరి ముఖ్యంగా మనుషులు ఎదుటి వ్యక్తులను దారుణంగా అతి కిరాతకంగా పొడిచి చంపేస్తున్నారు. మానవత్వం అన్న మాటని మరిచి ఎదుటి వ్యక్తిని ఎంతో సునాయాసంగా చంపేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పిల్లలు తల్లిదండ్రులను చంపడం లేదంటే తల్లిదండ్రులు పిల్లలను చంపడం ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.

అటువంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ జిల్లా కర్బన సమీపంలోని హిందూబేలాలో లల్లన్ అనే వ్యక్తి తన భార్య కూతుర్లతో కలిసి జీవిస్తున్నాడు. అయితే అతని పెద్ద కూతురు చాందీని రెండు నెలల క్రితం ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. చివరికి కుటుంబ సభ్యులు ఆమెను వెతికి ఇంటికీ తీసుకువచ్చారు. ఆ తర్వాత చాందీని మళ్లీ వెళ్లిపోవాలనుకుంది. ఈసారి తన చెల్లి ఆసియాతో కలిసి 20 రోజుల క్రితం ఇంటినుంచి పారిపోయింది.

 

అయితే ఇద్దరు కూతుర్లు ఇంటి నుంచి పారిపోయారని తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అక్కాచెల్లెళ్లు ఇద్దరు మహారాష్ట్రలోని ముంబైలో ఉన్నట్లు తెలుసుకుని ఇంటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో చాందీని ఓ యువకుడితో ప్రేమలో ఉందని ఆమె తండ్రి లల్లన్ కు తెలిసింది. ఈ విషయాన్ని అతను జీర్ణించుకోలేక కూతురిని ఒక గదిలో బంధించి చితకబాదాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక చాందినీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చిన్న కుమార్తె ఆసియాను తండ్రి బెదిరించాడు.

 

చివరికి కరెంట్ షాక్ తో తన కూతురు చనిపోయిందని గ్రామస్థులను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే సోదరి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆసియా జరిగిన విషయాన్ని మొత్తం స్థానికులకు చెప్పింది. దీంతో వారు లల్లన్ పై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -