King Nag: నాగ్ డిజాస్టర్ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్టైందా?

King Nag: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ యంగ్‌గా కనిపిస్తూ.. యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. సినిమాలతోపాటు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే కింగ్ నాగార్జున లేటెస్ట్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ది ఘోస్ట్’. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే ఇటీవల ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఓటీటీలో తెలుగు వెర్షన్‌లో విడుదలై ఈ సినిమా మొదటి వారంలోనే టాప్ పొజిషన్‌కు ఎగబాకింది. హిందీ వెర్షన్‌లోనూ సినిమా అదరగొడుతోంది.

 

నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్‌లో విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్‌లో నంబర్.1 స్థానాన్ని దక్కించుకుంది. ఈ వారం ట్రెండింగ్‌లో నిలిచింది. అలాగే తెలుగు వెర్షన్‌లోనూ నాలుగో స్థానాన్ని సంపాదించుకుంది. మొత్తానికి ‘ది ఘోస్ట్’ చిత్రం ఓటీటీలో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా సోనాల్ చౌహాన్ నటించింది. ఈ సినిమాకు ముందు హీరో నాగార్జున ‘బంగార్రాజు’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో హీరో నాగ చైతన్య, హీరోయిన్‌గా కృతి శెట్టి నటించింది. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా కూడా థియేటర్ల వద్ద కనక వర్షం కురిపించింది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు సినిమాను తెరకెక్కించారు.

కాగా, 1986లో విక్రం సినిమాతో హీరో నాగార్జున సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ‘కలెక్టర్ గారి అబ్బాయి, జానకి రాముడు, గీతాంజలి, శివ, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్, ఘరానా బుల్లోడు, నిన్నే పెళ్లాడుతా వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత దర్శకుడు రాఘవేంద్రారావు డైరక్షన్‌లో ‘అన్నమయ్య, శ్రీ రామదాసు’ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నాగార్జున తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఆ తర్వాత విడుదలైన ‘ఆవిడ మా ఆవిడే, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, బావ నచ్చాడు, సంతోషం, మన్మథుడు వంటి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాల్లో నటించాడు. మాస్, సూపర్ వంటి సినిమాల్లో నటిస్తూ.. ప్రేక్షకుల ఆదరణ పొందాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -