Kiran Abbavaram: కిరణ్ అబ్బవరానికి చుక్కలు చూపించిన అభిమానులు.. అలా జరగడంతో?

Kiran Abbavaram: డైనమిక్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. అది కూడా టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్‌లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’సినిమా చేసి హిట్టు కూడా కొట్టేశాడు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్మెంట్ లాంటి బడా నిర్మాణ సంస్థలతో సినిమా చేస్తున్నారు. ఆ సినిమానే మీటర్. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా రమేష్ కాదూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై చెర్రి, హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 7న వేసవిలో విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్‌ పోస్టర్‌ను హీరో కిరణ్ అబ్బవరం ట్వీట్ చేశాడు. ఈ రిలీజ్ డేట్‌ను మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ వ్యతిరేకిస్తున్నారు. రిలీజ్ డేట్ మార్చుకోవాలని కిరణ్ అబ్బవరంకి సూచిస్తున్నారు.
ఇప్పుడు వార్ మాత్రం పీక్స్ లో ఉంది. ఎందుకంటే.

 

రవితేజ నటిస్తోన్న ‘రావణాసుర’ సినిమా కూడా ఏప్రిల్ 7వ తేదీనే విడుదలవుతోంది. ఇప్పటికే ఈ విడుదల డేట్ ని ఫిక్స్ చేశాడు. ఇప్పుడు అదే రోజున ‘మీటర్’ కూడా విడుదలవుతుండటంతో రవితేజ ఫ్యాన్స్ వ్యతిరేకిస్తున్నారు.
రావణాసుర విడుదలైన రోజునే మీటర్ విడుదలైతే ఓపెనింగ్స్ కూడా రావని కొంతమంది రవితేజ ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
కిరణ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిదట. మరి అలాంటప్పుడు ఈ యంగ్ హీరో వెనక్కి ఎందుకు తగ్గుతారు. కచ్చితంగా మాస్ మహారాజాతో పోటీ పడతారు.

 

అతుల్య రవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతం సమకూరుస్తున్నారు. వెంకట్‌ సి. దిలీప్‌, సురేష్‌ సారంగం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జేవీ ప్రొడక్షన్ డిజైనర్. రమేష్‌ కాదూరి, సూర్య మాటలు రాశారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కూడా రమేష్‌ కాదూరి వహించారు.

Related Articles

ట్రేండింగ్

TTD’s Pink Diamond: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా?

TTD's Pink Diamond: జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అధికారంలోకి రావడం కోసం ఎన్నో నాటకాలను కూడా వేశారు అందులో భాగంగా కోడి కత్తి కావడం వైయస్ వివేక హత్య కావడం వంటివి...
- Advertisement -
- Advertisement -