Kirrak RP: చేపల పులుసు అమ్మి కిర్రాక్ ఆర్పీ కోటీశ్వరుడు కాబోతున్నాడా?

Kirrak RP: జబర్దస్త్ షో ద్వారా చాలా మంది కమెడియన్లు పేరు తెచ్చుకున్నారు. అందులో కిర్రాక్ ఆర్పీ కూడా ఒకడు. జబర్దస్త్, అదిరింది షోల ద్వారా మంచి పాపులారిటీ, గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే జబర్దస్త్ నుంచి బయటికొచ్చేసిన ఆర్పీ.. షోపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆర్పీ చేసిన వ్యాఖ్యలను చాలా మంది జబర్దస్త్ కమెడియన్లు కూడా తప్పుబట్టారు. ప్రస్తుతం ఆర్పీ.. ఈవెంట్స్, షోలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అయితే ఇటీవలే ఆర్పీ ఫుడ్ బిజినెస్‌లో కూడా అడుగు పెట్టాడు. ‘ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించి అందరికీ షాకిచ్చాడు.

 

 

ఆర్పీ రెస్టారెంట్ ప్రారంభించడంతో చాలా మంది నెగిటివ్ కామెంట్లు చేశారు. రెస్టారెంట్ త్వరలో మూసుకుపోనున్నట్లు పేర్కొన్నారు. కానీ ఊహించని విధంగా బిజినెస్‌లో రాణిస్తూ.. లక్షల్లో ఆదాయాన్ని గడిస్తున్నాడు. త్వరలో తన బిజినెస్‌కు వ్యాప్తి చేసే ఆలోచనలో ఆర్పీ ఉన్నట్లు తెలుస్తోంది. మరో 15 బ్రాంచీలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నట్లు ఆర్పీ చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆర్పీని చూసి షాక్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం రోజుకు రూ.2 లక్షల ఆదాయం జరుగుతోంది. నెలకు రూ.60 నుంచి రూ.70 లక్షల వరకు బిజినెస్ నడుస్తోంది. ఖర్చులన్నీ పోనూ ఆర్పీకి రూ.20 లక్షల ఆదాయం వస్తున్నట్లు సమాచారం. క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడట్లేదని, అందుకే ఖర్చు కూడా భారీ స్థాయిలోనే ఉన్నట్లు ఆర్పీ తెలిపారు.

 

 

అన్ని రెస్టారెంట్లకు భిన్నంగా ఆర్పీ కట్టెల పొయ్యిపై చేపల పులుసును వండుతుండటంతో ఈ రెస్టారెంట్‌కు ప్రజల నుంచి మంచి ఆదరణ అందుతోంది. అందుకే ప్రజలూ ఈ రెస్టారెంట్‌కు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్పీ బిజినెస్‌లో సక్సెస్ కావడంతో జబర్దస్త్ కమెడియన్లు, కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: కాంగ్రెస్ గెలుపు అక్కర్లేదు.. వైసీపీ ఓడితే చాలు.. షర్మిల ప్లాన్ సక్సెస్ అవుతుందా?

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి ఆదరణ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పై ఏపీ ప్రజలకు పీకల వరకు కోపం...
- Advertisement -
- Advertisement -