Kodali Nani: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కొడాలి నాని..!

టాలీవుడ్ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి వైసిపి మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. నందమూరి తారక రామారావు వారసుడిగా తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయన కుమారుడిగా బాలకృష్ణ లేదా ఎన్టీఆర్ చేపట్టే అవకాశాలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు పార్టీని తన చేతులలోకి తీసుకొని ముఖ్యమంత్రి అయిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్న కార్యకర్తలు తిరిగి పార్టీకి పూర్వ వైభవం రావాలంటే పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కి ఇవ్వాలని పెద్ద ఎత్తున అభిమానులు భావించారు.

ఈ విధంగా అభిమానులు కార్యకర్తలు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని కోరగా ఎన్టీఆర్ మాత్రం పార్టీలోకి రావడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు.ఇకపోతే తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్టీఆర్ భేటీ అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఈ భేటీ పై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోం శాఖ మంత్రి అమిత్ షా అవసరం లేనిదే ఒక నిమిషం కూడా ఎవరితోనూ మాట్లాడరని భావించారు.

ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో కాబట్టి ఆయన సేవలను ఉపయోగించుకోవడం కోసం బిజెపి పెద్ద ఎత్తున స్కెచ్ వేసిందని అయితే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ తీసుకొని బిజెపితో కలిసి పోటీ చేయడానికి సిద్ధమయ్యారని ఈయన తెలిపారు. ఇలా తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ చేతికి వెళితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారని ఇలా వీరందరూ పోటీ చేసినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడిస్తారని నాని తెలిపారు.

ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమికి వచ్చే సార్వత్రిక ఎన్నికలే ఆఖరి ఎలక్షన్స్ అవుతాయని ఈ సందర్భంగా ఈయన వ్యాఖ్యానించారు.ఇకపోతే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని చాలామంది భావిస్తున్నారు. అయితే ఆయనకు రావాలన్నప్పుడే రాజకీయాలలోకి వస్తారని ఆయన పార్టీలో కొనసాగాలనుకున్నప్పుడే కొనసాగుతారని ఈ సందర్భంగా నాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP: ఆ సర్వేలను నమ్ముకుంటే వైసీపీ కథ కంచికే.. ఆ మాటలు నమ్మితే నిండా మునిగినట్లే?

YSRCP: ఇప్పటివరకు వచ్చిన సర్వేల ఫలితాలు రోజురోజుకీ వైసీపీలో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. అలాగే ప్రత్యర్థి వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటంటే జాతీయస్థాయిలో బీజేపీ ది, ఏపీలో వైసీపీ ది అధికారం...
- Advertisement -
- Advertisement -