Virat Kohli: ఆ విషయంలో కోహ్లీ రియల్లీ గ్రేట్.. ఏం జరిగిందంటే?

Virat Kohli: ఈసారి ఎలాగైనా కప్పు మనదే అంటూ మైదానంలోకి దిగే బెంగళూరు ప్రతిసారి ఒట్టి చేతులతో వెనతిరిగి వస్తున్నారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లలో బెంగళూరు టీం ప్లే ఆఫ్ కి వెళ్లకుండానే నిష్క్రమించింది. దీంతో అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యారు. కప్పు గెలవడమే లక్ష్యంగా బరిలో దిగే బెంగళూరు చివరికి నిరాశతోనే వెను తిరుగుతున్నారు. ఇక బెంగుళూరు జ‌ట్టులో కోహ్లీ, డూప్లెసిస్‌, మాక్స్‌వెల్ లాంటి ప్రపంచ స్థాయి ఆట‌గాళ్లు ఉన్నారు. ముఖ్యంగా కింగ్ కోహ్లీ ఒక్క‌డు చాలు.

జ‌ట్టు ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నా గెలిపించే నైపుణ్యం అత‌ని సొంతం. ముగ్గురు ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయ‌ర్లు ఉన్న జ‌ట్టు ఇది. ముగ్గురూ ఫామ్‌లోనే ఉన్నారు. ఐనా స‌రే. బెంగళూరు టీ మాత్రం ప్లే ఆఫ్ కి చేరుకోలేకపోయింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో కోహ్లీ తన విశ్వరూపం చూపించారు. అయినప్పటికీ తన టీం గెలవలేకపోయింది. ఇలా క్రికెట్ అంటేనే ఒకరి కష్టం మాత్రమే కాదని అందరు కలిసికట్టుగా ఉంటేనే గెలుపు సాధించవచ్చు అని సంగతి తెలిసిందే.

 

బెంగళూరు టీం మాత్రం విజయం సాధించకపోవడానికి కారణం బౌలింగ్ అని తెలుస్తోంది. సిరాజ్ మిన‌హాయిస్తే ఈ ఐపీఎల్ లో బెంగ‌ళూరు త‌ర‌పున అద‌ర‌గొట్టిన బౌల‌ర్ లేడు. ఓ నాణ్య‌మైన స్పిన్న‌ర్ క‌రువ‌య్యాడు. ఐపీఎల్ లో గొప్ప ఫినిష‌ర్‌గా పేరు తెచ్చుకొన్న దినేష్ కార్తీక్ ఈసారి ఘోరంగా విఫ‌లం అయ్యాడు. ఇలా బౌలర్స్ సరైన రీతిలో బౌలింగ్ చేయకపోవడం కూడా బెంగళూరు టీంకు మైనస్ గా మారిందని అందుకే ప్లే ఆఫ్ లో ఆరో స్థానంలో మిగిలిపోయిందని తెలుస్తోంది.

 

ఇలా బెంగుళూరు టీం కప్పు గెలవకపోయినా అభిమానులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఏమాత్రం ఫామ్ లో లేనటువంటి కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన బ్యాటింగ్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. దీంతో బెంగళూరు టీమ్ గెలవకపోయినా త‌మ కింగ్ కోహ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు. చివ‌రికి వ‌ర‌కూ ఓట‌మి ఒప్పుకోని అత‌ని త‌త్వం మ‌రోసారి ఫ్యాన్స్‌కి న‌చ్చింది. అందుకే బెంగ‌ళూరు ఓడినా… కోహ్లీ గెలిచాడనీ అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -