Kohli: ప్రపంచంలోనే బెస్ట్ క్రికెటర్ అతడే.. తేల్చి చెప్పిన కోహ్లీ

Kohli: ప్రపంచంలోనే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ పేరు తెలియవారు ఎవరూ ఉండరు. ప్రపంచ క్రికెటర్‌లో బెస్ట్ క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. ఏ ఫార్మాట్ అయినా సరే అత్యుత్తమ క్రికెటర్‌గా కోహ్లీ పేరు చెబుతారు. ఇక ఐపీఎల్‌లో కూడా కోహ్లీ బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ప్రపంచ క్రికెట్‌లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎవరని కోహ్లీని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దీంతో కోహ్లీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చాలా కష్టమైన ప్రశ్న అని చెప్పిన కోహ్లీ.. దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్, శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగ పేర్లు చెప్పాడు. వారిద్దరూ మంచి క్రికెటర్లు అని చెప్పాడు. డివిలియర్స్ ఆర్సీబీ తరపున ఎన్నో ఏళ్లు ఆడారని, అందుకే ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని అన్నాడు.

ఐపీఎల్‌లో డివిలియర్స్‌తో కలిసి ఎన్నో ఏళ్లు ఆడానని, ఇప్పటికీ తామిద్దరి మధ్య స్నేహం కొనసాగుతుందని కోహ్లీ చెప్పాడు. డివిలియర్స్ అత్యుత్తమ పినిషర్ అని చెప్పాడు. ఇక తక్కువ రేటింగ్ కలిగిన ఆటగాళ్లలో అంబటి రాయుడు పేరు చెప్పిన కోహ్లీ..షేన్ వాట్సన్ గొప్ప ఆల్‌రౌండర్ అని అన్నాడు. ఇక నరైన్, రషీద్ ఖాన్‌లలో రషీద్ ఖాన్ గొప్ప స్పిన్నర్ అని కోహ్లీ అభిప్రాయపడ్డారు. ఇక తనకు టీ20లలో ఫుల్ షాట్ అంటే చాలా ఇష్టమన్నాడు.

 

ఇక ఇష్టమైన ప్రత్యర్ధి జట్టులలో చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఇష్టమని, ఎక్కువ ఫ్యాన్ బేస్ సీఎస్కేకు ఉందని అన్నాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్‌ల కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 208 మ్యాచ్ లలో 6వేలకుపైగా పరుగులు చేశాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీ జట్టుకే కోహ్లీ ఆడుతుండగా.. ఆ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ఇక డివిలియర్స్ మొత్తంలో 184 మ్యాచ్ లు ఇడగా.. 5 వేల పరుగులు చేశాడు. 151.69 స్ట్రైక్ రేట్, 39,71 సగటు కోహ్లీకి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -