Komati Reddy Venkat Reddy: భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం టీ కాంగ్రెస్‌లో సంచలనం రేపుతోంది. మునుగోడు ఉపఎన్నికలు వచ్చిన తర్వాత వెంకటరెడ్డి వ్యవహారం కలకలం రేపుతూనే ఉంది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆయన ప్రచారానికి వస్తారా.. లేదా అనేది కొద్దిరోజులు పాటు చర్చనీయాంశంగా మారింది. కానీ చివరకు తాను ప్రచారానికి వెళ్లేది లేదంటూ తెగేసి చెప్పేశారు. మునుగోడులో తన అవసరం కాంగ్రెస్ కు లేదని, డీసీపీ స్థాయి వ్యక్తులే అక్కడ ప్రచారం చేసి కాంగ్రెస్ ను గెలిపిస్తారంటూ విమర్శించారు.
అనంతరం శుక్రవారం ఆస్ట్రేలియా పర్యటనకు కుటుంబసభ్యులతో కలిసి వెంకటరెడ్డి వెళ్లిపోయారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న క్రమంలో ఆయన పట్టించుకోకుండా విదేశీ పర్యటనకుకు వెళ్లడంపై కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ మునుగోడు ఉపఎన్నిక ఉండటంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ అధిష్టానం వెనకడుగు వేస్తోంది. మునుగోడు ఉపఎన్నిక ముగిసిన తర్వాత వెంకటరెడ్డిని సస్పెండ్ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
మునుగోడు ఉపఎన్నికల సమయంలో వెంటకరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. రాజకీయం డైవర్ట్ అయ్యే అవకావముంది. మునుగోడులో ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పై దాని ప్రభావం పడే అవకాశముంటుంది. అందుకే బైపో ల్ ముగిసిన తర్వాత సస్పెండ్ చేసే అవకాశముంటుందని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంటకరెడ్డి చేస్తున్న ప్రచారం హస్తం పార్టీలో గుబులు రేగుతోంది. ముునుగోడులో కాంగ్రెస్ గెలవదని, రాజగోపాల్ రెడ్డిదే గెలుపునంటూ ఆస్ట్రేలియాలో తనను రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన అభిమానులతో వెంకటరెడ్డి వ్యాఖ్యానించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. తాను ప్రచారం చేస్తే పది ఓట్లు వస్తాయని, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండదని చెప్పడంలో కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి.
ఇక మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలంటూ ఓ కాంగ్రెస్ నేతతో వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ మారింది. పార్టీలకతీతంగా అందరూ రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని, త్వరలో తాను పీసీసీ చీఫ్ వుతానంటూ ఆ కాల్ లో వెంకటరెడ్డి అన్నట్ల ుఉంది. తాను పీసీసీ చీఫ్ అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానంటూ చెప్పుకొచ్చారు. ఈ ఆడియోతో పాటు ఆస్ట్రేలియాలో మాట్లాడిన వీడియో బయటకు రావడంపై కాంగ్రెస్ వర్గాలు సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే వెంకటరెడ్డి ఆడియో టేప్, వీడియోను కాంగ్రెస్ అధినాయకత్వానికి రాష్ట్ర నేతలు పంపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా వెంకటరెడ్డి వ్యవహారంపై ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో మునుగోడు ఉపఎన్నిక తర్వాత వెంకటరెడ్డిపై వేటు వేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో వెంకటరెడ్డి బీజేపీలో చేరుతారా అనే ప్రచారం జరుగుతోంది.