Komati Reddy Venkata Reddy: బీజేపీలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komati Reddy Venkata Reddy: మునుగోడులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తరపున ప్రచారం చేయకపోవడంపై ఆ పార్టీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీకి మద్దతు తెలపకుండా తన తమ్ముడి పక్షాన వెంకటరెడ్డి ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే వాదనలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీ మారే అవకశముందని, తమ్ముడి బాటలో ఆయన కూా బీజేపీలో చేరే అవవకాశముందనే ప్రచారం గత కొద్దిరోజులుగా జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.

తాను కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ పార్టీలోనే ఎప్పటికీ కొనసాగుతానంటూ చెప్పుకొచ్చారు. చనిపోయేంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటూ చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి అంటే కాంగ్రెస అని.. కాంగ్రెస్ అంటే వెంకటరెడ్డ అని చెప్పుకొచ్చారు. వెంకటరెడ్డి వ్యాఖ్యలతో గత కొంతకాలంగా పార్టీ మారుతున్నట్లు ఆయనపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పడినట్లు అయింది. తాను కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ పదవిని మాత్రమే ఆశించానని, సీఎం, మంత్రి పదవులు ఆశించలేదంటూ చెప్పుకొచ్చారు. సీఎం, మంత్రి పదవులు తనకు అవసరం లేదని తెలిపారు.

మునుగోడు ఉపఎన్నిక ప్రచారానకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. కానీ వెంకటరెడ్డి మాత్రం సొంత పార్టీ నేతలే తనను దూషించారని, అందుకే మునుగోడు ప్రచారానికి వెళ్లలేనని తెలిపారు. సొంత తమ్ముడే పోటీ చేయడం వల్లే అతడికి వెంకటరెడ్ి మద్దతు ఇస్తున్నారు. మునుగోడులో ప్రచారం చేయాల్సి వస్తే.. తమ్ముడికి వ్యతిరేకంగా వెంకటరెడ్డి ప్రచారం చేయాల్సి వస్తుంది. అందుకే కోమటరిెడ్డి వెంకటరెడ్డి మునుగోడులో ప్రచారానికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పార్టీ నేతలు అందరూ మునుగోడులో ప్రచారానికి రావాల్సిందిగా వెంకటరెడ్డిని కోరారు. అయినా ఆయన ప్రచారానికి వెళ్లడం లేదు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి వెళ్లడంపై ఏఐసీసీకి కూడా రాష్ట్ర నేతలు ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ కూడా ప్రచారానికి వెళ్లాల్సిందిగా సూచించింది. సోనియాగాంధీ, ప్రియాాంక గాంధీలతో కూడా వెంకటరెడ్డి భేటీ అయ్యారు మునుగోడులో ప్రచారానికి వెళ్లతానంటూ ప్రియాంకగాంధీకి వెంకటరెడ్డి తెలిపినట్లు చెప్పారు. కానీ అయినా కూడా వెంకటరెడ్డి మునుగోడు ప్రచారానికి వెళ్లలేదు. దీంతో వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీకి రాష్ట్ర నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఏఐసీసీ కూడా వెంకటరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఎన్నికల తర్వాత వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మునుగోడు ఉపఎన్నికల సమయంలో వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తే కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యతిరేకత వచ్చే అవకాశముందని నేతలు చెబుతున్నారు. అందుకే మునుగోడు ఉఫఎన్నికల తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసే అవవాకశముందనే ప్రచారం రాష్ట్ర నేతల్లో జరుగుతోంది. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీలోకి చేరే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. తన తమ్ముడి బాటలోనే ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో తనపై వచ్చే వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -