Komatireddy: కాషాయ గూటికి కోమటరిెడ్డి వెంకటరెడ్డి… ముహూర్తం అప్పుడేనా?

Komatireddy: భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరే అవకాశముందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మునుగోడు ఉపఎన్నికలో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కాంగ్రెస్ నేతలకు ఫోన్లు చేసి చెప్పడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అలాగే మునుగోడు కాంగ్రెస్ గెలవదంటూ ఆస్ట్రేలియా పర్యటనలో తనను కలిసిన అభిమానులతో వెంకటరెడ్డి మాట్లాడిన వీడియో బయటకు రావడంపై కాంగ్రెస్ వర్గాలు ఆయనపై భగ్గుమన్నాయి. ఈ ఆడియో, వీడియోపై రాష్ట్ర నేతలు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ స్పందించింది.

 

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియోపై వివరణ ఇవ్వాల్సిందిగా వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులకు 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వలేదు. తన సొంత పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికలో ప్రచారం చేయకపోవడం, బీజేపీ నుంచి పోటీ చేసిన తన తమ్ముడికి ఓటేయాలని కోరి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేయడం, షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వకపోవడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

 

ఇదే జరిగితే వెంకటరెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. తమ్ముడి బాటలోనే ఆయన కూడా కాషాయ కండువా కప్పుకుంటారనే వార్తలు వస్తున్నాయి. నల్గొండ జిల్లాలో కోమటిరె రెడ్డి బ్రదర్స్ కు మంచి పలుకుబడి ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వారికి అభిమానులు ఉన్నారు. దాదాపు 6 నియోజవకర్గాల్లో గెలుపును ప్రభావితం చేసే శక్తి కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఉంది. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో బీజేపీకి కలిసొస్తుందని కాషాయదళం భావిస్తోంది. అలాగే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉండి, వెంకటరెడ్డి కాంగ్రెస్ లో ఉంటే ఆ రెండు పార్టీలకు కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై అనుమానాలు వ్యక్తం అయ్యే అవకాశముంటుంది.

 

అందుకే ఇద్దరూ ఒకే పార్టీలో ఉండాలని కోమటిరెడ్డి బ్రదర్స్ భావిస్తోన్నారు. మునుగోడు ఉపఎన్నిక తర్వాత వెంకటరెడ్డిపై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంటుంది. మునుగోడు పోలింగ్ కు ముందే ఆయనపై వేటు వేస్తే కాంగ్రెస్ లోని ఆయన అభిమానులు, వర్గీయుల నుంచి వ్యతిరేక వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల మునుగోడులో కాంగ్రెస్ కు చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే మునుగోడు ఉపఎన్నిక ముగిసిన తర్వాత వెంకటరెడ్డిని కాంగ్రెస్ సస్పెండ్ చేసే అవకాశముందని, అదే జరిగితే ఆయన బీజేపీలో చేరే అవకాశముందని అంటున్నారు.

 

అయితే ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అభిమానులతో వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనునిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశానని, ఇక రాజకీయాలు చాలని అనిపిస్తోందంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ బీజేపీలో చేరడం ఇష్టం లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో వెంకటరెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు.కొంతమంది అనుచరులు మాత్రం రాజకీయాలకు గుడ్ బై చెప్పవద్దని, వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని చెబుతున్నారు. మరి వెంకటరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -