CM KCR: కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ పరువు తీస్తూ?

CM KCR: తాజాగా రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు బీజేపీ పార్టీ నేత అయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కెసిఆర్ పై సంచులన వాఖ్యలు చేశారు. తాజాగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్లలో జరిగిన బీజేపీ విజయ్ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టేది పార్టీ బీజేపీనే అంటూ బల్లగుద్ది మరి చెప్పారు. మొదట్లో వ్యాపారాలు చేసుకునే తనని రాజకీయాల్లోకి పిలిచింది కేసీఆర్ అని తెలిపారు. కెసిఆర్ వి అన్నీ కూడా డైవర్ట్ దోపిడీలే అని ఆరోపించారు.

అంతే కాకుండా తెలంగాణలో అమలు అవుతున్న పథకాలకు సంబందించిన నిధులన్నీ కూడా కేంద్రానివేనని ఆరోపించారు కొండా విశ్వేశర్ రెడ్డి. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా భూ సేకరణ పూర్తికాకపోవడంతోనే చేవెళ్ల హైవే పూర్తి కాలేదని దళితులకు మూడెకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. అలాగే ఫజల్ బీమా పథకం తెలంగాణలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రైతులకు ఫర్టిలైజేషన్ సబ్సిడీ ఏమైందన్నారు. చేవెళ్లలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించలేదు అంటూ కెసిఆర్ పై మండిపడ్డారు.

మిషన్ తెలంగాణ సక్సెస్ అవుతుందని అన్నారు న్ తెలంగాణలో పంట నష్టం పరిహారం ఏదని రైతులకు సబ్సిడీ ఏది అంటూ ప్రశ్నించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి బిజెపి నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -