Kota: ఆ కోరిక తీర్చకపోతే పదివేల పైన వేస్తా.. ట్రాఫిక్ పోలీస్ నిర్వాకం?

Kota: ప్రస్తుత సమాజంలో ఆడవారి అవసరాలను అవకాశాలుగా మార్చుకొని వారిని లైంగికంగా వేధించడం వారిపై అత్యాచారాలకు పాల్పడడం లాంటివి చేస్తున్నారు. సామాన్య వ్యక్తులు మాత్రమే కాకుండా కొంచెం పదవులలో చదువుకున్న వారు కూడా ఇలాంటి దారుణాలకే ఒడుగడుతున్నారు. తాజాగా కూడా ఒక ట్రాఫిక్ పోలీస్ ఇలాంటి పనికి ఒడిగట్టాడు. హెల్మెట్ ధరించని ఒక విద్యార్థినిని తన ఇంటికి వచ్చి తన కోరిక తీర్చాలని కోరిక తీర్చకపోతే పదివేలు చలానా కూడా విధిస్తానని హెచ్చరించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ కోటా పరిధిలోని ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో చదువుతున్న యువతీ తాజాగా స్కూటీపై వెళ్తోంది. ఈ క్రమంలోనే క్వార్డు సర్కిల్ వద్ద విధుల్లో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కైలాష్ యువతి స్కూటీని ఆపాడు. హెల్మెట్ ధరించకపోవడంతో ఎందుకు హెల్మెట్ ధరించలేదని ఆమెను ప్రశ్నించాడు. అయితే బైక్ పక్కన ఆపి హెల్మెట్ హెల్మెట్ ధరించ నందుకు ఫైన్ వేయడం ఆపేసి విద్యార్థినికి పెళ్లయిందా లేదా అంటూ పర్సనల్ విషయాలు అడగడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా మొదట తనతో స్నేహం చేయాలని అడగడంతో పాటు ఇంటివద్ద భార్య పిల్లలు లేరని తన వెంట వస్తే మొబైల్ గిఫ్ట్ గా ఇస్తానని విద్యార్థినికి ఆఫర్ కూడా ఇచ్చాడు.

అంతటితో ఆగకుండా తాను చెప్పినట్టు వినకపోతే పదివేల రూపాయలు చలానా విధిస్తానని బెదిరించాడు. సమయంలో ఆ యువతీకి ఏం చేయాలో తెలియక మళ్లీ కలుస్తానని చెప్పి తప్పించుకుని పోయి నేరుగా ఎస్పీ ని కలిసింది. ఈ కార్యాలయంలో తనకు జరిగింది మొత్తం చెప్పుకుని ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -