Kotha Kothaga Review: కొత్త కొత్తగా సినిమా రివ్యూ & రేటింగ్

విడుదల తేదీ:సెప్టెంబర్‌–09, 2022
నటీనటులు: అజయ్, వీర్తి వఘాని, ఆనంద్‌ (సీనియర్‌ హీరో), కాశీ విశ్వనా«థ్, తులసి, కల్యాణి నటరాజన్, పవన్‌ తేజ్, ఈ రోజుల్లో సాయి తదితరులు.
నిర్మాత:మురళీధర్‌ రెడ్డి ముక్కర
దర్శకత్వం:హనుమాన్‌ వాసంశెట్టి
సంగీతం: శేఖర్‌ చంద్ర
ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి

Kotha Kothaga Movie Review and Rating

ప్రస్తుతం టాలీవుడ్‌లో విభిన్న కథా చిత్రాల జోరు సాగుతుంది. అయినా లవ్‌ ఎంటర్‌టైనర్స్‌కి బాగా ఆదరణ ఉంది. ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్, ఎంగేజ్‌ చేసేలా ఉంటే మరింత ఆదరణ పొందుతూ బాక్సాఫీసు వద్ద విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి మంచి యూత్‌ ఫుల్‌ లవ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ తో వచ్చిన చిత్రం ‘కొత్త కొత్తగా’చిత్రం. ఫన్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై అజయ్, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్‌ వాసంశెట్టి దర్శకత్వంలో మురళీధర్‌ రెడ్డి ముక్కర నిర్మిస్తున్నారు. బిజి గోవింద రాజు చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

కథ: ఆనంద్‌ (సీనియర్‌ హీరో), కల్యాణి నటరాజన్‌ల కూతురు రాజీ (వీర్తి వఘాని), విశ్వనాథ్, తులసి ల కొడుకు సిద్దు (అజయ్‌) ఇద్దరూ రఘు ఇంజినీరింగ్‌ కాలేజ్‌ లో చదువుకుంటుంటారు. అబ్బాయికి షేక్‌ హ్యాండ్‌ కూడా ఇవ్వడానికి ఇష్టపడని రాజీని చూడగానే సిద్దు ఇష్టపడతాడు.రాజీ కోసం తన ప్రాణం సైతం ఇచ్చేంతగా ప్రేమిస్తుంటాడు. మరో వైపు రాజీ అన్న కేశవ్‌ తన చెల్లికి దూరపు సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు.అయితే కేశవ్‌ బామ్మర్ది రామ్‌ (పవన్‌ తేజ్‌) తన అక్క సత్య (లావణ్య రెడ్డి) తో రాజీ అంటే చాలా ఇష్టమని తనని పెళ్లి చేసుకొంటానంటాడు. రామ్‌ తల్లి తండ్రులు రాజీవ్‌ కుటుంబంతో మాట్లాడడంతో మొదట కేశవ్‌కు ఇష్టం లేకపోయినా చివరికి ఒకే అనడంతో రామ్‌తో రాజీకి పెళ్లి ఫిక్స్‌ చేస్తారు.

రాజీకి ఇంకా చదువు కోవాలనే ఇష్టం ఉన్నా తల్లి తండ్రుల మాట కాదనలేక, ఇటు సిద్దు తనకోసం ప్రాణం ఇవ్వడానికి సిద్దపడ్డాడన్న విషయం తెలుసుకొని తనను దూరం చేసుకోలేక తన జీవితంలో రాజీ ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొంది? తల్లి తండ్రుల మాట కాదనలేక తన బాధని భయాన్ని మనసులో పెట్టుకొని రామ్‌ను పెళ్లి చేసుకోందా? లేక తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే సిద్దుని పెళ్లిచేసుకుందా? అలాగే అజయ్‌ తను ప్రేమించిన రాజీ కోసం ఏం త్యాగం చేశాడు? చివరికి రాజీ ప్రేమను దక్కించుకున్నాడా.. అనేది తెలుసు కోవాలంటే థియేటర్‌కు వెళ్లి ‘కొత్తగా కొత్తగా‘ సినిమా చుడాల్సింది..∙

నటీ నటుల పనితీరు: హీరో గా సిద్దు పాత్రలో నటించిన విజయ్‌ లో చాలా ఫైర్‌ వుంది. తొలి సినిమానే చాలా అనుభవం ఉన్న నటుడిగా చేశాడు. రాజీ (వీర్తి వఘాని) ఒక పెద్దింటి పల్లెటూరు అమ్మాయిగా మెప్పించింది. రొమాన్స్‌ కానీ.. ప్రేమలోనూ తను అన్ని భావోద్వేగాలను చాలా బాగా పండించింది. ఈ సినిమాలో అజయ్, వీర్తి ఫెయిర్‌ చాలా క్యూట్‌గా ఉంది.

రాజీ అన్నగా కేశవ్‌ (అనిరుద్‌ ) రఫ్‌ క్యారెక్టర్‌లో ఒదిగిపపోయాడు. రాజీ బావగా రామ్‌ (పవన్‌ తేజ్‌), రాజీకి వదినగా సత్య (లావణ్య రెడ్డి) తమదైన శైలిలో నటించారు. బస్టాప్, ఈ రోజుల్లో ఫెమ్‌ సాయి హీరో ఫ్రండ్‌ క్యారెక్టర్‌లో చాలా బాగా నటించాడు. అలాగే వాసు మంచి రోల్‌ చేశాడు. ఇంకా ఈ సినిమాలో నటించిన వారంతా వారివారి పాత్రల్లో ఒదిగిపోయాడరు.

విశ్లేషణ: ఇప్పుడు వస్తున్న సినిమాలకు డిఫరెంట్‌గా ప్రాపర్‌ కంటెంట్‌తో టైటిల్‌ లో ఉన్న కొత్తదనం సినిమాలో ఉండేలా చూసుకుంటూ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు సర్‌ప్రై జ్‌ చేస్తూ దర్శకుడు హనుమాన్‌ వాసం శెట్టి టైటిల్‌ లో ‘కొత్తగా కొత్తగా’ ఉన్నట్టే సినిమాలోనూ కొత్త దనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శేఖర్‌ చంద్ర ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. సిద్‌ శ్రీరామ్‌ పాడిన ప్రియతమా పాట చిత్రానికి హైలెట్‌ గా నిలుస్తుంది. అలాగే డైమండ్‌ రాణి పాటలు ఇలా ఈ చిత్రంలో అన్ని పాటలు చాలా బాగున్నాయి అనంత శ్రీరామ్‌ కాసర్ల శ్యామ్, శ్రీమణి చక్కగా పాటలు రాశారు అనురాగ్‌ కులకర్ణి, మిగతా గాయకలు అద్భుతంగా పాడారు.

అందుకే పాటలు కొత్తగా వచ్చాయి. హరి కిరణ్‌ మాస్టర్‌ ఎంతో అందంగా కోరియోగ్రఫీ చేయగా వెంకట్‌ అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్‌ అదిరింది. ఫన్‌ ఫుల్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై నిర్మాతలు మురళీధర్‌ రెడ్డి ముక్కర, గోవింద రాజుగారు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను చాలా చక్కగా నిర్మించారు.ప్రేక్షకుడు ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆ నెక్ట్స్‌ ఏం జరుగుతుందనే సస్పెన్షన్‌ ఉంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఉన్న ఈ సినిమా చివరి వరకు ప్రేక్షకులను ఎంటటైన్‌ చేస్తోంది.

రివ్యూ రేటింగ్‌: 3.25/5

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -