KovaiSarala: గుర్తు పట్టలేని స్థితిలో ప్రముఖ నటి కోవై సరళ.. ఏమైందంటే?

KovaiSarala: సినీ ఇండస్ట్రీలో అందరికీ స్టార్ రేంజ్ రావడం ఎంతో కష్టం. అందులోనూ కమెడియన్‌గా గుర్తింపు రావడానికి చాలా కష్టపడాలి. టాలీవుడ్‌లో కమెడియన్స్ అంటే ముందుగా మేల్ ఆర్టిస్టులపైనే ఫోకస్ వెళ్తుంది. లేడీ కమెడియన్స్ గా పాపులారిటీ సాధించిన వాళ్లల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. వీరిలో కోవై సరళ ఒకరు. లేడీ కమెడియన్‌గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈమె నటించిన సినిమాలన్నీ దాదాపు సక్సెస్ అయినవే. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా కోవై సరళ ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆమె చేసిన ప్రతీ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

 

 

వెండితెరపై కడుపుబ్బా నవ్వించే కోవై సరళ.. జీవితంలో కన్నీళ్లు, కష్టాలు మాత్రమే మిగిలాయి. ఎందుకంటే కోవై సరళ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. అయితే ఎందుకు పెళ్లి చేసుకోలేదనే విషయం తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె బాధను చూసి కన్నీళ్లు ఆపుకోలేరు. ప్రస్తుతం కోవై సరళ వయసు 59 ఏళ్లు. అయితే ఇన్నేళ్లు ఆమె పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉందనే విషయం ఎవరికీ తెలియదు. కోవై సరళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడమే దానికి కారణం. కోవైకు నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు చేసి పిల్లలు పుట్టే సరికి బాధ్యతలు పెరిగాయి. తన గురించి ఆలోచించే సమయం లేకుండా పోయింది. అప్పుడు ఫ్యామిలీ బాగుంటేనే చాలు అనుకుంది. పుట్టిన పిల్లలకు మంచి విద్యను అందించి ఓ గొప్ప స్థాయికి రావాలని కోవై సరళ కష్టపడుతోంది. ఈ విషయాన్ని కోవై సరళ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

పెళ్లి చేసుకుంటే ఆ బాధ్యతలు తీసుకోలేనని కోవై సరళ చెప్పుకొచ్చారు. అందుకే తాను పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని కుటుంబానికి అంకితం చేశారు. అయితే కొన్నేళ్లుగా కోవై సరళ సినిమాల్లో కనిపించడం లేదు. 2019లో ‘అభినేత్రి-2’ సినిమాలో చివరిసారిగా నటించారు. అయితే ఆమె నటించడం మానేసిందా? అనుకునే సమయంలో షాకింగ్ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గుర్తు పట్టలేని స్థితిలో కోవై సరళ మారిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -