KR Vijaya: హీరోయిన్ కేఆర్ విజయ కూతురు కూడా స్టార్ హీరోయినేనటా?

KR Vijaya: సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్ నటీనటుల వారసులు ఎంట్రీ ఇచ్చారు. అలా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వారసులు ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే చాలా మంది ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నప్పటికీ.. మరికొందరు ఫెయిలై.. ఇంటిబాట పడుతుంటారు. సినిమాల్లో రాణించాలంటే.. యాక్టింగ్ స్కిల్స్‌ తోపాటు కోసింత లక్‌ కూడా ఎంతో అవసరం. టాలీవుడ్‌లో ప్రస్తుతం అప్పటి హీరోలకు చెందిన వారసులు ఇండస్ట్రీని ఏలుతున్నారు. సీనియర్ నటి కేఆర్ విజయ తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు ఉండే ఉంటుంది. ఆమె తనయురాలు కూడా ప్రస్తుతం సినిమాల్లో వచ్చిందనే విషయం చాలా మందికి తెలియదు. సీనియర్ హీరోయిన్ కేఆర్ విజయ అప్పట్లో దిగ్గజ నటీమణులు సావిత్రి, యమున వంటి స్టార్ హీరోయిన్లతో పోటీగా సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. విజయ.. ఎక్కువగా జానపద, సాంఘిక, పౌరాణిక సినిమాల్లో నటించింది.

 

విజయ.. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో సినిమాలు చేసింది. తెలుగు సినిమాల్లో ఎక్కువ దేవత పాత్రల్లో నటించింది. అలా తెలుగు ప్రేక్షకులకు కేఆర్ విజయ ఎంతో దగ్గరైంది. ఆమె నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. అయితే విజయ కూతురు, చెల్లెలు కూడా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. విజయకు ఇద్దరు కూతుర్లు అనూష, మణిరాగా. వీరిద్దరిలో అనూష హీరోయిన్ కాగా, మణిరాగా ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. వీరిద్దరూ కూడా తెలుగు, తమిళం, మలయాళం భాషల సినిమాల్లో నటిస్తున్నారు. అయితే వీరిద్దరూ విజయ కూతుర్లు అని చాలా మందికి తెలియదు. విజయ ఫ్యామిలీ నుంచి చాలా మంది నటీనటులు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. కానీ వీరిలో చాలా మంది సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు. మరికొందరు మాత్రం సినిమాల్లో నటిస్తూ.. గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -